Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB Playing XI: అతనికి నిరాశే.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ఆర్‌సీబీ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్‌లో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్‌సీబీ ఘోర పరాజయం చవిచూసింది.

ఈ మ్యాచ్‌లో సిక్సర్ల సునామీ సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 287 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ఇప్పటికే 7 పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆర్‌సీబీపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

RCB Playing XI vs SRH Glenn Maxwell continues to sit out in IPL 2024 Match at Uppal

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై పరుగుల వరద పారించాలని సన్‌రైజర్స్ భావిస్తోండగా.. విజయమే లక్ష్యంగా ఆర్‌సీబీ సిద్దమవుతోంది. అయితే తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఆర్‌సీబీ.. అదే జట్టును కొనసాగించే అవకాశం ఉంది.

పేలవ ప్రదర్శనతో తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్.. హైదరాబాద్‌తో మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. ఓపెనర్లుగా ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరికి హైదరాబాద్ బౌలర్లపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా హైదారబాద్‌లో కోహ్లీ పరుగుల వరద పారించాడు.

RCB Playing XI vs SRH Glenn Maxwell continues to sit out in IPL 2024 Match at Uppal

గ్లేన్ మ్యాక్స్‌వెల్ గైర్హాజరీలో విల్ జాక్స్ జట్టులో కొనసాగనున్నాడు. అతను ఫస్ట్ డౌన్‌లో ఆడనున్నాడు. కేకేఆర్‌‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రజత్ పటీదార్ సైతం గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ‌తో సత్తా చాటాడు. కామెరూన్ గ్రీన్‌కు మరో అవకాశం దక్కనుంది. మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ ఫినిషర్లుగా బరిలోకి దిగనున్నారు. కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్ బౌలర్లుగా కొనసాగనున్నారు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)

ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్

Story first published: Wednesday, April 24, 2024, 17:10 [IST]
Other articles published on Apr 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+