హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో గెలిస్తే మరో మ్యాచ్‌లో ఓడుతున్న ఆర్‌సీబీ నిలకడగా విజయాలు సాధించడంపై ఫోకస్ పెట్టింది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకున్న ఆర్‌సీబీ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది. గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలతో బరిలోకి దిగనుంది. పర్యావరణ పరీరక్షణ, పచ్చదనం, చెట్ల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ఆర్‌సీబీ గత 11 ఏళ్లుగా 'గో గ్రీన్'కార్యక్రమం నిర్వహిస్తోంది.
2011 సీజన్ నుంచి ప్రతీ ఏడాది ఒక మ్యాచ్‌ను 'గ్రో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా గ్రీన్ జెర్సీలతో ఆడుతోంది. ఈ క్రమంలోనే ఈ సారి రాజస్థాన్ రాయల్స్‌తో గ్రీన్ జెర్సీలో తలపడనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఆదివారం గ్రీన్ జెర్సీలతో పచ్చదనంగా మారిపోనుంది. గ్రీన్ జెర్సీ మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీకి మెరుగైన రికార్డు లేదు.

మొత్తం 12 మ్యాచ్‌ల్లో మూడింటిలోనే గెలిచింది. గతేడాది గ్రీన్ జెర్సీలో గెలిచిన ఆర్‌సీబీ అదే జోరును కొసాగించాలనుకుంటోంది. ఈ క్రమంలోనే టీమ్ బలహీనతలపై ఫోకస్ పెట్టింది. పక్కటెముకల గాయంతో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గత మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేయగా.. ఈ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ఒకవేళ అతను పూర్తిగా కోలుకోకుంటే విరాట్ కోహ్లీ సారథిగా వ్యవహరించనుండగా.. ఫాఫ్ మరోసారి బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు. ఆర్‌సీబీ టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నా మిగతా బ్యాటర్లు విఫలమవుతుండటం ఆర్‌సీబీకి కష్టంగా మారుతోంది. బిగ్ హిట్టర్ దినేశ్ కార్తీక్‌తో పాటు షెహ్‌బాజ్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంది.
బౌలింగ్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరుస్తుండగా.. వానిందు హసరంగా గాడిన పడ్డాడు. హర్షల్ పటేల్, విజయ్ కుమార్ వైశాఖ్ రాణించాల్సిన అవసరం ఉంది. వ్యాన్ పార్నెల్ వికెట్లు తీస్తున్నా ధారళంగా పరుగులిస్తున్నాడు. దాంతో అతని స్థానంలో డేవిడ్ విల్లేను ఆడించే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.
రాజస్థాన్‌తో ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), మహిపాల్ లోమ్రోర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), వానిందు హసరంగా, వ్యాన్ పార్నెల్/డేవిడ్ విల్లే, విజయ్ కుమార్ వైశాఖ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాశ్ ప్రభుదేశాయ్, కర్ణ్ శర్మ