RCB Playing XI vs KXIP:ఓపెనర్‌గా అనూజ్.. నంబర్ 3లో కోహ్లీ! తొలి మ్యాచ్‌కు ఆర్‌సీబీ జట్టు ఇదే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సమాయత్తమైంది. నయా సారథి ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఆదివారం రాత్రి జరిగే తమ ఫస్ట్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. విజయంతోనే తమ టైటిల్ వేటను ప్రారంభించానలనుకుంటుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌తో టీమ్ కాంబినేషన్‌పై ఓ అంచనాకు వచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్‌కు వ్యక్తిగత కారణాలతో ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న గ్లేన్ మ్యాక్స్‌వెల్, హెజిల్ వుడ్ స్థానాలను ఎవరితో భర్తీ చేయాలనే విషయాన్ని తేల్చుకోలేకపోతుంది. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా ఆడుతాడా? లేక ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగుతాడా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే టీమ్ కాంబినేషన్‌పై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా ఫాఫ్, అనూజ్..
జట్టులోకి కొత్తగా వచ్చిన ఫాఫ్ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించుకున్న ఆర్‌సీబీ అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. టాపార్డర్ బ్యాటింగ్ బాధ్యతలను అతనే మోస్తాడని భావిస్తోంది. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఫాఫ్ దుమ్మురేపాడు. ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్‌సీబీ తరఫున కూడా అదే జోరును కొనసాగిస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. ఇక అతనికి తోడుగా యువ ప్లేయర్ అనూజ్ రావత్ ఆడే అవకాశం ఉంది. డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి రికార్డున్న అనూజ్.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా రాణించాడు. వికెట్ కీపర్ అయిన అనూజ్ ఓపెనర్‌గా వస్తే.. కోహ్లీ ఫస్ట్ డౌన్‌లో బరిలోకి దిగనున్నాడు.

మ్యాక్సీ స్థానంలో..
ఇటీవలే ఓ ఇంటివాడైన గ్లేన్ మ్యాక్స్‌వెల్, పాకిస్థాన్ పర్యటనలో ఉన్న జోష్ హజెల్ వుడ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ ఏప్రిల్ 6 వరకు అందుబాటులో ఉండరు. దాంతో మ్యాక్సీ స్థానంలో విండీస్ ఆల్‌రౌండర్ షెఫ్రెన్ రూథర్ ఫోర్డ్, హేజిల్ వుడ్ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లేకు చోటు దక్కనుంది. దాంతో నాలుగో స్థానంలో మహిపాల్ లోమరోర్ బరిలోకి దిగనుండగా.. ఐదో స్థానంలో దినేశ్ కార్తీక్ ఆడనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్లుగా వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ వానిందు హసరంగా, షాబాజ్ అహ్మద్ ఆడటం ఖాయం. ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే మాత్రం షాబాజ్ అహ్మద్ స్థానంలో సిద్ధార్థ్ కౌల్ ఆడనున్నాడు. హర్షల్ పటేల్, డేవిడ్ విల్లేతో కూడిన పేస్ విభాగాన్ని సిరాజ్ నడిపించనున్నాడు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్(కీపర్), మహిపాల్ లోమ్‌రోర్, వానిందు హసరంగా, శబాజ్ అహ్మద్/సిద్దార్థ్ కౌల్, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లే, మహమ్మద్ సిరాజ్.


ఆర్‌సీబీ టీమ్
భారతీయులు: విరాట్ కోహ్లీ, అనూజ్, దినేశ్ కార్తీక్, సిసోడియా, అనీశ్వర్, హర్షల్, మహిపాల్ లామ్రోర్, షాబాజ్, ప్రభుదేశాయ్, ఆకాశ్ దీప్, సీవీ మిలింద్, కర్ణ్ శర్మ, సిరాజ్, సిద్దార్థ్ కౌల్.
ఫారిన్ ప్లేయర్లు : డుప్లెసిస్ (కెప్టెన్), హేజిల్‌వుడ్, బెరెండార్ఫ్, హసరంగ, డేవిడ్ విల్లే, మ్యాక్స్‌వెల్, ఫిన్ అలెన్, రూథర్ ఫోర్డ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications