RCB vs GT: బెంగళూరుకు లైఫ్ అండ్ డెత్ గేమ్.. ఆ ముగ్గురిపైనే ఆశలు? తుది జట్లు ఇవే!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తర గేమ్‌కు రంగం సిద్దమైంది. లీగ్ తుది దశకు చేరడంతో మ్యాచ్‌లు ఉత్కంఠగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఆయా జట్లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి. నేడు వాంఖడే వేదికగా రాత్రి 7.30కు జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరి గెలవాలి. అంతేకాకుండా నాలుగో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ .. ముంబైతో శనివారం జరిగే మ్యాచ్‌లో ఓడాలి. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీకి ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్.
మరోపు 10 విజయాలు 20 పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ తమ జైత్రయాత్రను కొనసాగించాలనుకుంటుంది. తద్వారా మరింత ఆత్మవిశ్వాసంతో ప్లే ఆఫ్స్ బరిలోకి దిగి టైటిల్ గెలవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ను కూడా ఆ జట్టు ఏమాత్రం లైట్ తీసుకోవడం లేదు. అయితే తమ టీమ్ లోపాలను సరిచేసుకోవడానికి ఈ మ్యాచ్‌ను సన్నాహకంగా వాడుకోవాలనుకుంటుంది.

ఆ ముగ్గురు చెలరేగితే..
ఆర్‌సీబీకి విజయంతో పాటు మెరుగైన రన్‌రేట్ కూడా అవసరమే కాబట్టి టాప్-3 బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన ఆ జట్టు స్టార్ పేసర్ హజెల్ వుడ్ లయను అందుకోని కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. ఇక ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మహమ్మద్ సిరాజ్ సైతం కీలక మ్యాచ్‌లో సత్తా చాటాలి. అతన్ని పవర్ ప్లే, స్లాగ్ ఓవర్లలో కాకుండా మిడిల్ ఓవర్లలో ఎక్కువగా ఉపయోగించుకోవాలి. ఈ సీజన్‌లో తనదైన హిట్టింగ్‌తో చిరస్మరణీ విజయాలు అందించిన దినేశ్ కార్తీక్.. మరోసారి తన తడాఖ చూపించాలి. అయితే రషీద్ ఖాన్ బౌలింగ్‌ను అతను ఆచితూచి ఆడాలి. హసరంగా.. తన ఫామ్ కొనసాగించాలి.. హర్షల్ పటేల్ వికెట్లతో చెలరేగాలి. అప్పుడు ఆర్‌సీబీ పని సులవవుతోంది. ఇక ఈ కీలకపోరుకు ఆర్‌సీబీ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.

కీలక ఆటగాళ్లకు రెస్ట్..
ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకున్న గుజరాత్ తమ కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చి బెంచ్ ప్లేయర్ల సత్తాను పరీక్షించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో రెగ్యూలర్‌గా ఆడిన డేవిడ్ మిల్లర్, మహమ్మద్ షమీలతో పాటు తడబడుతున్న మాథ్యూవేడ్‌ను పక్కనబెట్టే అవకాశం ఉంది. వేడ్ స్థానంలో రెహ్మనుల్లా గుర్బాజ్‌ను ఆడించే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్‌కు చెందిన యువ కెరటానికి టీ20ల్లో మంచి రికార్డు ఉంది. ఇక డెవిడ్ మిల్లర్ స్థానంలో విండీస్ ప్లేయర్ డొమినిక్ డ్రేక్స్‌ను బరిలోకి దించవచ్చు. షమీకి రెస్ట్ ఇస్తే.. ప్రదీప్ సంగ్వాన్ జట్టులోకి వస్తాడు.

తుది జట్లు: (అంచనా)
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), హర్షల్ పటేల్, వానిందు హసరంగా, మహమ్మద్ సిరాజ్, జోష్ హజెల్ వుడ్
గుజరాత్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, రెహ్మనుల్లా గుర్బాజ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డొమినిక్ డ్రేక్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, ప్రదీప్ సంగ్వాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications