ఐపీఎల్ 2024 సీజన్‌లో 6 పరాజయాల తర్వాత విజయాన్నందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం జరగనున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్‌లోని వరల్డ్ బిగ్గెస్ట్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సత్తా చాటింది. పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వారి సొంతగడ్డపై 35 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సన్‌రైజర్స్ ప్రధాన బలం అయిన బ్యాటింగ్‌పైనే దెబ్బ కొట్టి అద్భుత విజయాన్నందుకుంది. ఈ గెలుపు ఆర్‌సీబీ ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసింది. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్ కొనసాగనున్నారు. ఫెర్గూసన్‌ను పక్కనపెడితే విజయ్ కుమార్ వైశాఖ్ తుది జట్టులోకి వస్తాడు. రజత్ పటీదార్, స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడనున్నారు.

ఇదే జోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించాలనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన స్వప్నిల్ సింగ్.. బౌలింగ్‌లో సత్తా చాటాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ అతను కొనసాగనున్నాడు. ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగనుంది.
అయితే మానసిక ఒత్తిడితో తుది జట్టు నుంచి తప్పుకున్న గ్లేన్ మ్యాక్స్‌వెల్ అందుబాటులోకి వస్తే మాత్రం మార్పులు చేయనున్నారు. మ్యాక్సీ కోసం విల్ జాక్స్, కామెరూన్ గ్రీన్, లూకీ ఫెర్గూసన్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఫెర్గూసన్‌ను పక్కనపెడితే ఇండియన్ పేసర్ తుది జట్టులోకి వస్తాడు. నరేంద్ర మోదీ స్టేడియం పెద్ద మైదానం కావడంతో స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు.

ఈ క్రమంలోనే కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, విల్ జాక్స్‌లను కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. కోహ్లీ, డుప్లెసిస్ ఓపెనింగ్ చేయనుండగా.. విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ ఫినిషర్లుగా బరిలోకి దిగనున్నారు.
ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్/గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లూకీ ఫెర్గూసన్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్