Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB Playing XI: ఆ కుర్రాడిపై వేటు.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడే ఆర్‌సీబీ తుది జట్టు ఇదే!

ఐపీఎల్ 2024 సీజన్‌లో 6 పరాజయాల తర్వాత వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరగనున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది. గత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తోనే ఆడి విజయం సాధించిన ఆర్‌సీబీ.. ఈ సారి సొంతమైదానంలో పోటీ పడేందుకు సిద్దమైంది.

అహ్మదాబాద్‌ వేదికగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. విల్ జాక్స్(41 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్స్‌లతో 100 నాటౌట్), విరాట్ కోహ్లీ(44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో 201 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే చేధించింది.

RCB Playing XI vs GT for IPL 2024 Anuj Rawat In and Mahipal Lomror Out

ఈ భారీ విజయం ఆర్‌సీబీ ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసింది. ఇదే జోరులో గుజరాత్ టైటాన్స్‌ను రెండోసారి ఓడించాలనే పట్టుదలతో ఆర్‌సీబీ ఉంది. మానసిక ఒత్తిడితో జట్టుకు దూరంగా ఉన్న మ్యాక్సె‌వెల్ గత మ్యాచ్‌తోనే జట్టులోకి వచ్చాడు. అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకున్నా బౌలింగ్‌లో సత్తా చాటాడు.

బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌కు కూడా ఆర్‌సీబీ ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. అయితే చిన్నస్వామి పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు జట్టులో ఒకటి రెండు మార్పులు చేయవచ్చు. యువ ప్లేయర్ మహిపాల్ లోమ్రార్ స్థానంలో మరో ప్లేయర్‌ను తీసుకోవచ్చు. ముఖ్యంగా పిచ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేసే విజయ్‌కుమార్ వైశాఖ్‌ను జట్టులోకి తీసుకోవచ్చు.

స్పిన్నర్లు కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, విల్ జాక్స్‌, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లను కొనసాగించనున్నారు. బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. కోహ్లీ, డుప్లెసిస్ ఓపెనింగ్ చేయనుండగా.. విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, మ్యాక్స్‌వెల్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు. పేసర్లుగా యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్ ఆడనున్నారు.

రజత్ పటీదార్, స్వప్నిల్ సింగ్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోనున్నారు. ముందుగా బ్యాటింగ్ చేస్తే రజత్ పటీదార్.. సెకండ్ బ్యాటింగ్ చేస్తే స్వప్నిల్ సింగ్‌ తుది జట్టులో ఉండనున్నారు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్

Story first published: Friday, May 3, 2024, 16:50 [IST]
Other articles published on May 3, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+