RCB Playing XI: ఓపెనర్‌గా కోహ్లీ.. సీఎస్‌కేతో తలపడే ఆర్‌సీబీ తుది జట్టు ఇదే!
ఐపీఎల్ 2024 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)తో చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. 17 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే కసితో బరిలోకి దిగుతున్న ఆర్‌సీబీ.. విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించాలనుకుంటోంది.
డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన అమ్మాయిల స్పూర్తితో ఆర్‌సీబీ అభిమానుల ఆనందాన్ని డబుల్ చేస్తామని ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలో టైటిల్ సాధించి తమ కలను నెరవేర్చుకుంటామని చెప్పాడు. అందుకోసం తమ సాయశక్తులా పోరాడుతామని తెలిపాడు.
మరోవైపు యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. తొలి మ్యాచ్‌లో గెలిచి తమ అభిమానులను సంతోషపరిచాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నా.. వికెట్ కీపర్‌గా అంతా తానే నడిపించే అవకాశం ఉంది. దాంతో తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.

ఓపెనర్‌గా కోహ్లీ..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. గత సీజన్‌లో ఈ ఇద్దరూ అద్భుత ప్రదర్శన కనబర్చారు. అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఫ్రెష్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మిడిలార్డర్‌లో ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న కామెరూన్ గ్రీన్ బరిలోకి దిగనున్నాడు. రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి అతను మిడిలార్డర్ బాధ్యతలు పంచుకోనున్నాడు. రూ. 17.5 కోట్ల భారీ ధరకు ట్రేడ్ చేసుకున్న కామెరూన్ గ్రీన్‌పై ఆర్‌సీబీ భారీ ఆశలు పెట్టుకుంది. ఫినిషర్లుగా మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్ ఆడవచ్చు.
ఆర్‌సీబీ పూర్తి జట్టు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లేన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్, అల్జారి జోసెఫ్ (రూ. 11.50 కోట్లు), యశ్ దయాల్ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్ (రూ. 2 కోట్లు), టామ్ కరన్ (రూ. 1.50 కోట్లు), సౌరభ్ చౌహాన్ (రూ. 20 లక్షలు), స్వప్నిల్ సింగ్ (రూ. 20 లక్షలు)
ఇంపాక్ట్ ప్లేయర్‌గా కార్తీక్..
దినేశ్ కార్తీక్ ఫిట్‌గా లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అదే జరిగే అనూజ్ రావత్ వికెట్ కీపర్‌గా జట్టులోకి రానున్నాడు. అప్పుడు అవసరాన్ని బట్టి కార్తీక్‌ను ఉపయోగించుకోనున్నారు. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్ బరిలోకి దిగనున్నారు. అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంటే ఫెర్గూసన్ బెంచ్‌కు పరిమితమవుతాడు. రీస్ టోప్లీ అందుబాటులోకి వస్తే అతనికే తొలి ప్రాధాన్యత దక్కనుంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కర్ణ్ శర్మ ఆడనుండగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్ అతనికి సాయం చేయనున్నాడు. చెన్నై పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరూ కీలకం కానున్నారు.
ఆర్‌సీబీ తుది జట్టు (అంచనా)
ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, కామెరూన్ గ్రీన్, రజత్ పటీదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, లాకీ ఫెర్గూసన్/అల్జారీ జోసెఫ్, మహమ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications