For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB Playing XI: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. ఆర్‌సీబీ తుది జట్టు ఇదే!

గత 17 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా అందుకోవాలనే లక్ష్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వ్యూహాలు రచిస్తోంది. ముందుగా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసిన ఆర్‌సీబీ.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కావాల్సిన ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. ముఖ్యంగా ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది.

ముఖ్యంగా గత కొన్నేళ్లుగా వేధిస్తున్న బౌలింగ్ బలహీనతను అధిగమించింది. అనుభవం కలిగిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్‌లను తీసుకొని బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది. పేపర్‌పై ఆర్‌సీబీ జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో సమతూకంగా కనిపిస్తోంది. మెగా వేలంలో మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ కోసం ఆర్‌సీబీ ప్రయత్నించినా.. తీసుకోలేకపోయింది. కానీ సీనియర్ స్పిన్నర్ అయిన కృనాల్ పాండ్యా, యువ ప్లేయర్ సుయాష్ శర్మలను కొనుగోలు చేసింది.

RCB Playing XI For IPL 2025 Virat Kohli Captain Krunal Pandya IN Padikkal IMPACT

ఆర్‌సీబీ సారథ్య బాధ్యతలను తిరిగి విరాట్ కోహ్లీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ ఇంగ్లండ్ ఓపెనర్ కేకేఆర్ తరఫున గత సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లోనూ ఫిల్ సాల్ట్ అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేస్తాడని ఆర్‌సీబీ భావిస్తోంది.

మూడో స్థానంలో రజత్ పటీదార్ బరిలోకి దిగనున్నాడు. గత సీజన్లలో నిలకడగా రాణించడంతో ఆర్‌సీబీ అతన్ని రిటైన్ చేసుకుంది. నాలుగో స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ లియామ్ లివింగ్‌‌స్టోన్ ఆడనున్నాడు. అతను నిలకడగా రాణించకపోయినా.. తనదైన రోజు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేస్తాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆడనున్నాడు.

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున జితేశ్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆరో స్థానంలో పేస్ ఆల్‌రౌండర్ టీమ్ డేవిడ్ ఆడనుండగా.. కృనాల్ పాండ్యా ఏడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఏడో స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండటం ఆర్‌సీబీకి కలిసొచ్చే అంశం. జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. సుయాశ్ శర్మ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడనున్నాడు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా): విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, దేవదత్ పడిక్కల్(ఇంపాక్ట్).

Story first published: Friday, December 20, 2024, 14:57 [IST]
Other articles published on Dec 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+