For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. ఓపెనర్‌గా ఫిల్‌‌ సాల్ట్! ఆర్‌సీబీ తుది జట్టు అంచనా ఇదే!

గత 17 ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్‌ను ఈ సారైనా అందుకోవాలనే లక్ష్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సిద్దమవుతోంది. ముందుగా జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసిన ఆర్‌సీబీ.. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వ్యూహాత్మకంగా తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. ముఖ్యంగా ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియానికి సరిపోయే ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది.

ముఖ్యంగా గత కొన్నేళ్లుగా జట్టును వెంటాడుతున్న బౌలింగ్ బలహీనతను అధిగమించింది. అనుభవం కలిగిన జోష్ హజెల్ వుడ్, భువనేశ్వర్ కుమార్‌లను తీసుకొని బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసింది. పేపర్‌పై ఆర్‌సీబీ జట్టు బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో సమతూకంగా కనిపిస్తోంది. మెగా వేలంలో మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ కోసం ఆర్‌సీబీ ప్రయత్నించినా.. తీసుకోలేకపోయింది. కానీ సీనియర్ స్పిన్నర్ అయిన కృనాల్ పాండ్యా, యువ ప్లేయర్ సుయాష్ శర్మలను కొనుగోలు చేసింది.

RCB Playing XI For IPL 2025 Virat Kohli As Captain and Phil Salt As Opener

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ..
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టును విరాట్ కోహ్లీ నడిపించే అవకాశాలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం జట్టు సారథ్య బాధ్యతలు వదిలేసిన కింగ్ కోహ్లీ.. టీమ్ ప్రయోజనాల కోసం మళ్లీ కెప్టెన్సీ చెపట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గత సీజన్ తరహాలోనే కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడుగా ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

ఈ ఇంగ్లండ్ ఓపెనర్ కేకేఆర్ తరఫున గత సీజన్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆర్‌సీబీ భారీ ధరకు దక్కించుకుంది. గత కొన్ని సీజన్లుగా ఆర్‌సీబీ తరఫున నిలకడగా రాణిస్తున్న భారత బ్యాటర్ రజత్ పటీదార్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

మిడిలార్డర్‌లో డేంజరస్ బ్యాటర్లు..
నాలుగో స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌‌స్టోన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గ్లేన్ మ్యాక్స్‌వెల్ స్థానాన్ని లివింగ్ స్టోన్‌తో భర్తీ చేయాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ భావించింది. అతను నిలకడగా రాణించకపోయినా.. తనదైన రోజు మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ చేస్తాడు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఆడనున్నాడు. వేగంగా పరుగులు చేయడంతో పాటు చివర్లో మెరుపులు మెరిపించడం జితేశ్ శర్మ ప్రత్యేకత.

ఆరో స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఆడనున్నాడు. టీమ్ అవసరాలకు తగ్గట్లు కృనాల్ పాండ్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అతని ద్వారా జట్టుకు సమతూకం రానుంది. పేస్ ఆల్‌రౌండర్ టీమ్ డేవిడ్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. పవర్ హిట్టింగ్‌తో లోయరార్డర్‌లో విలువైన పరుగులు చేయగలడు.

భువీ సారథ్యంలో పేస్ దళం..
భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. హజెల్ వుడ్‌, యశ్‌దయాల్‌తో పాటు ఆల్‌రౌండర్ టీమ్ డేవిడ్ అతనితో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగనున్నాడు. దేవదత్ పడిక్కల్, స్వప్నిల్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఆడే అవకాశం ఉంది.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా):
విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ,

ఇంపాక్ట్ ప్లేయర్స్
దేవదత్ పడిక్కల్, స్వప్నిల్ సింగ్

Story first published: Thursday, January 9, 2025, 7:02 [IST]
Other articles published on Jan 9, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+