RCB Playing 11 For IPL 2022: బెంగళూరులోకి ప్యాట్ కమిన్స్, శిఖర్ ధావన్.. ప్రాబబుల్ ఎలెవన్ ఇదే!

హైదరాబాద్: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి మరో 48 గంటల్లో తెరలేవనుంది. సమయం దగ్గరపడుతున్న వేళ అటు ఫ్రాంచైజీల్లో.. ఇటు అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఏయే ఆటగాళ్లను తీసుకోవాలని, ఎంత ఖర్చు పెట్టాలనే ఆందోళనలో ఫ్రాంచైజీలు ఉంటే.. తమ అభిమాన జట్లు తీసుకునే ఆటగాళ్లు ఎవరో? అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
ఇక గత 13 సీజన్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా దక్కించుకోవాలని భావిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సరైన టీమ్ తీసుకోవాలని ఆ జట్టు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సాల కప్‌నమ్‌దే అంటూ ప్రతీ సీజన్‌లో నిరాశపరిచిన ఆర్‌సీబీ.. ఈ సారి ఆ స్లోగన్‌కు న్యాయం చేయాలని ఆర్‌సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. రిటెన్షన్ ప్రక్రియలో విరాట్ కోహ్లీ(రూ.15), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ. 7 కోట్లు)లను మాత్రమే తీసుకున్న ఆర్‌సీబీ రూ.33 కోట్లే ఖర్చు పెట్టింది. ఇంకా ఆ జట్టు దగ్గర రూ.57 కోట్లు ఉన్నాయి. ఓ రకంగా వేలంలో ఇది మంచి అమౌంటేనని, సత్తా కలిగిన ఆటగాళ్లను తీసుకోవాలని, ఒంటెత్తు పోకడ ప్రదర్శించవద్దని సూచిస్తున్నారు.
అయితే ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడం.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఏబీడీ వంటి స్టార్ ప్లేయర్‌తో పాటు కెప్టెన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగా వేలంలో ఆర్‌సీబీ డేవిడ్ వార్నర్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్‌లను తీసుకోవాలని భావిస్తోంది. అయితే విరాట్ కోహ్లీనే మళ్లీ కెప్టెన్‌గా నియమించాలని, కెప్టెన్ కోసం అనవసరంగా ఖర్చు చేయాల్సిన పనిలేదని ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓపెనర్లుగా శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ స్లాట్ కోసం శిఖర్ ధావన్‌తో పాటు డేవిడ్ వార్నర్‌పై ఆర్‌సీబీ కన్నేసింది. డేవిడ్ వార్నర్ కోసం భారీ ధర వెచ్చిచ్చేందుకు కూడా ఆర్‌సీబీ సిద్దంగా ఉంది. వార్నర్‌ను తీసుకుంటే కెప్టెన్సీ లోటు కూడా తీరుతుందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. శిఖర్ ధావన్ కోసం గట్టిగానే ప్రయత్నించాలనుకుంటుంది. ఓ ఫారిన్ ఓపెనర్‌తో పాటు స్వదేశీ ఓపెనర్‌ను బరిలోకి దించాలనుకుంటుంది. వార్నర్ దొరకకపోతే.. జానీ బెయిర్ స్టోలను ఆర్‌సీబీ ప్రయత్నించవచ్చు. అయితే అభిమానులు మాత్రం వార్నర్, ధావన్ ఓపెనింగ్ జోడీ సూపర్బ్ అని, గతంలో సన్‌రైజర్స్ ఈ ఇద్దరు కలిసి ఆడారని గుర్తు చేస్తున్నారు.

మిడిలార్డర్‌లో విరాట్, కేఎస్ భరత్, మ్యాక్సీ, మిచెల్ మార్ష్
ఇక మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను తీసుకోవడం కష్టమైన పని. ఈ ఇద్దరికి ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీళ్లు భారీ ధర పలికే చాన్సుంది. కాబట్టి వీరిని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా గత సీజన్‌లో అదరగొట్టిన కేఎస్ భరత్‌తో పాటు ప్రపంచకప్‌లో మెరిసిన మిచెల్ మార్ష్‌లను తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మిచెల్ మార్ష్ ఫిట్‌నెస్ విషయాన్ని పరిగణలోకి తీసుకొనే ఈ నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఫిట్‌గా లేకుంటే ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌పై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

స్పిన్నర్లుగా చాహర్, సుంధర్..
స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుంధర్, స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్‌గా రాహుల్ చాహర్‌లను ఆర్‌సీబీ తీసుకునే చాన్సుంది. తమ మాజీ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ కోసం కూడా ఆర్‌సీబీ ప్రయత్నించవచ్చు. కానీ తీవ్ర పోటీ కారణంగా అతను ఆర్‌సీబీ చేజారే అవకాశం ఉంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగా, నాథన్ లయన్‌లను కూడా ఆర్‌సీబీ టార్గెట్ చేయవచ్చు. కానీ ఇండియన్ స్పిన్నర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సూచిస్తున్నారు. ఈ లెక్కన సుంధర్, చాహర్ మంచి ఎంపికని అభిప్రాయపడుతున్నారు.

పేసర్లుగా కమిన్స్, సిరాజ్, నటరాజన్..
జట్టు పేసర్లుగా ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, నటరాజన్, క్రిస్ జోర్డాన్‌లను ఆర్‌సీబీ టార్గెట్‌గా పెట్టుకుంది. వేలానికి భారీ డబ్బే ఉండటంతో స్టార్ ప్లేయర్లకు ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తోంది. అయితే కమిన్స్, రబడా వంటి ఆటగాళ్లు రూ. 15 కోట్లకు పైగా పలికే అవకాశం ఉంది కాబట్టి భారత పేసర్లే ఆర్‌సీబీకి దక్కే చాన్సుంది.
నటరాజన్, ప్రసిధ్ కృష్ణలలో ఒకరిని కొనుగోలు చేసే చాన్సుంది. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉన్న నేపథ్యంలో అతనికి తోడుగా ఓ ఫారిన్ ప్లేయర్‌ను తీసుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది. ప్యాట్ కమిన్స్, కగిసో రబడాల్లో ఒకరిని కచ్చితంగా తీసుకోనుంది.

ఆర్‌సీబీ ప్రాబబుల్ ఎలెవన్
డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్‌వెల్, కేఎస్ భరత్, మిచెల్ మార్ష్, వాష్టింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్/రబడా, మహమ్మద్ సిరాజ్, నటరాజన్, రాహుల్ చాహర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications