Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Glenn Maxwell: సెంచరీతో చెలరేగిన ఆర్‌సీబీ ప్లేయర్.. ఇది ట్రైలరే! ఐపీఎల్‌లో ఒక్కొక్కడికి చుక్కలే!

RCB Player Glenn Maxwell
IPL 2022 Retention : Kohli Salary Cut Like Dhoni | RCB Captain Mystery || Oneindia Telugu

మెల్‌బోర్న్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాట్స్‌మన్, ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్(57 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103) సెంచరీతో చెలరేగాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. పరుగుల విధ్వంసం సృష్టించాడు. మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.6 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

తొలుత తన శైలికి భిన్నంగా పరిస్థితులకు తగ్గట్లు నెమ్మదిగా ఆడిన మ్యాక్సీ.. ఆ తర్వాత గేరు మార్చాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ తర్వాత కూడా పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తూనే.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. దాంతో మ్యాక్సీ 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత అదే జోరులో భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసిన మ్యాక్సీ.. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అతనికి అండగా.. నిక్ లార్కిన్(23), కార్ట్ రైట్(23) నిలవడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ స్టార్స్ 5 వికెట్లకు 177 రన్స్ చేసింది.

బిగ్‌బాష్ లీగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు ఇదే తొలి సెంచరీ కాగా.. మెలోబోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన జాబితాలో ఐదో స్తానంలో నిలిచాడు. మ్యాక్సీ(103) కన్నా ముందు మార్కస్ స్టోయినిస్ (79 బంతుల్లో 147 నాటౌట్), రైట్(60 బంతుల్లో 117), రైట్ (63 బంతుల్లో 109 నాటౌట్), హ్యాండ్‌ స్కోంబ్ (103 నాటౌట్) ఉన్నారు. ఇక మ్యాక్సీ స్పెషల్ ఇన్నింగ్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇది అసలు సిసలు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ అని ప్రశంసిస్తున్నారు. మెల్ బోర్న్ స్టార్స్ చేసిన 177 పరుగుల్లో 103 మ్యాక్సీవే కావడం విశేషం. ఈ స్పెషల్ ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ అభిమానుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. ఈ ఇన్నింగ్స్ జస్ట్ ట్రైలరేనని, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్కొక్కడికే చుక్కలే కనబడుతాయని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, December 15, 2021, 15:39 [IST]
Other articles published on Dec 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+