Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ellyse Perry: చీర కట్టులో కత్తిలా ఆర్‌సీబీ మహిళా క్రికెటర్..! (వీడియో)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రీ చీర కట్టులో సందడి చేసింది. డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆసీస్ స్టార్.. తాజాగా ఆ ఫ్రాంచైజీ నిర్వహించిన రెట్రో నైట్ కార్యక్రమంలో చీర కట్టులో మెరిసింది. బ్లాక్ సారీలో ముగ్ద మనోహరంగా సిద్దమై కనిపించింది.

నవ్వులు చిందిస్తూ అభిమానులకు వినోదం పంచింది. నిండైన చీరలో ఎల్లిస్ పెర్రీ అభిమానుల మనసులు దోచేసింది.చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ ఈ ఆసీస్ స్టార్ కుర్రాళ్లకు కనువిందు చేసింది. స్లీవ్‌లెస్ జాకెట్‌లో పరువాలను ప్రదర్శిస్తూ మైమరిపించింది.ట్రెడిషనల్ లుక్‌లో ఈ హాట్ బ్యూటీ క్రికెటర్ చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

RCB Player Ellyse Perry Stunning In Saree Pics Goes Viral

భారత సంప్రదాయ దుస్తుల్లో మెరిసి బాలీవుడ్ హీరోయిన్స్‌కే అసూయ పుట్టేలా అందాలను ప్రదర్శించింది. రెట్రో నైట్ కార్యక్రమంలో పాత పాటలకు చిందేసింది. సహచర ఆర్‌సీబీ ప్లేయర్లతో రచ్చరచ్చ చేసింది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలతో పాటు వీడియోను ఆర్‌సీబీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో అభిమానులతో పంచుకుంది. చీరకట్టులో ఎల్లిస్ పెర్రీని చూసి స్టన్ అయిన అభిమానులు.. ఆమె అందాన్ని తమ కవిత్వంతో వర్ణిస్తున్నారు. 'నా కళ్లకు బాలీవుడ్ హీరోయిన్‌లా కనిపిస్తున్నావు డార్లింగ్' అంటూ ఒకరు కామెంట్ చేస్తే...ఈ చీర కట్టులోనే ఏదో తెలియని కిక్కు ఉందబ్బా' అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.

ప్రస్తుతం ఎల్లిస్ పెర్రీ చీర కట్టు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ సీజన్‌లో ఎల్లిస్ పెర్రీ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 8, 23 నాటౌట్, 44 నాటౌట్, 58, 24 పరుగులతో సత్తా చాటింది.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ..3 విజయాలతో పాటు 3 పరాజయాలు నమోదు చేసి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

Story first published: Saturday, March 9, 2024, 19:15 [IST]
Other articles published on Mar 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+