Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పోక్సో కేసు ఎఫెక్ట్.. జట్టు మారిన ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్!

భారత పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ యశ్ దయాల్ తన దేశవాళీ టీమ్‌‌ను మార్చేసాడు. ఉత్తరప్రదేశ్ జట్టును వదిలి ఛత్తీస్‌ఘడ్ తరఫున అప్‌కమింగ్ దేశవాళీ క్రికెట్ సీజన్ 2026-27 ఆడేందుకు సిద్దమవుతున్నాడు. పోక్సో కేసుతో పాటు పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న యశ్ దయాల్‌‌పై ఉత్తప్రదశ్ క్రికెట్ అసోసియేషన్(యూపీసీఏ) వేటు చేసింది. దాంతో అతను జట్టును మారాలని నిర్ణయించుకున్నాడు.

యూపీ క్రికెట్ అసోసియేషన్ ఇంకా యశ్ దయాల్‌కు నో అబ్జెజక్షన్ సర్టిఫికేట్ జారీ చేయలేదని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఓసీ ప్రాసెస్‌లో ఉందని, యశ్ దయాల్ మాత్రం ఛత్తీస్‌ఘడ్ ప్రీ సీజన్ క్యాంప్‌లో పాల్గొన్నాడని తెలిపింది. ఛత్తీస్‌ఘడ్ నయా కోచ్ అమయ్ ఖురాసియా పర్యవేక్షణలో యశ్ దయాల్ ప్రిపరేషన్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పొక్సో కేసుతో యశ్ దయాల్ సుదీర్ఘ కాలంగా ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

RCB Pacer Yash Dayal to play for Chhattisgarh in upcoming domestic season seeks NOC from UPCA

ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత..

ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత అతను ఎలాంటి క్రికెట్ ఆడలేదు. పొక్సో కేసు నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ నుంచి యశ్ దయాల్‌ను ఆర్‌సీబీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. యశ్ దయాల్ వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో అతన్ని జట్టులోకి తీసుకోవడం జట్టుతో పాటు అతనికి శ్రేయాస్కారం కాదని ఆర్‌సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబట్ మీడియాకు తెలిపాడు.

IND vs ZIM: జింబాబ్వే క్లీన్ స్వీప్.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి ట్రోఫీ కైవసం!

IND vs ZIM: జింబాబ్వే క్లీన్ స్వీప్.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలి ట్రోఫీ కైవసం!

యూపీ టీ20 లీగ్ టోర్నీలో యశ్ దయాల్‌ను గోరఖ్‌పుర్ లయన్స్ రిటైన్ చేసుకుంది. ఆ ఫ్రాంచైజీ తరఫున అతను ట్రైనింగ్ కూడా మొదలుపెట్టాడు. కానీ వేలం తర్వాత యశ్ దయాల్ పేరు లేకుండా ఆ ఫ్రాంచైజీ జట్టును ప్రకటించింది. యూపీ క్రికెట్ అసోసియేషన్ సూచనలతోనే అతన్ని లీగ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అతని వేటు గురించి మాట్లాడేందుకు యూపీసీఏ కూడా నిరాకరించింది.

ప్రాక్టీస్ షురూ..

తనకు యూపీసీఏలో అవకాశాలు రావని భావించే యశ్ దయాల్.. పక్క రాష్ట్రాల అసోసియేషన్‌ల తరఫున ఆడేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ఎన్‌ఓసీ పొంది పక్క అసోసియేషన్‌లకు ప్రాతినిధ్యం వహించినా కూడా సొంత రాష్ట్రంలోని ఫ్రాంచైజీ లీగ్ ఆడవచ్చు. యశ్ దయాల్ ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్ ప్రీ సీజన్ క్యాంప్‌లో పాల్గొన్నాడు. దేశవాళ్లీ స్టార్స్ జయంత్ యాదవ్, వెటరన్ ఆల్‌రౌండర్ ధర్మేంద్రసిన్ష్ జడేజా‌లతో కలిసి ప్రిపరేషన్ కూడా ప్రారంభించాడు.

రెండు క్రిమినల్ కేసులు..

ప్రస్తుతం యశ్‌దయాల్‌పై రెండు క్రిమినల్ కేసులున్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ యశ్ దయాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అలహాబాద్ హై కోర్టు అతనికి బెయిల్ ఇచ్చినప్పటికీ.. బీఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఆరోపణలను యశ్ దయాల్ న్యాయవాదులు ఖండించారు. ఈ ఫిర్యాదుతో యశ్ దయాల్‌ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు.

IPL 2026: అత్యాచార కేసు.. యశ్ దయాల్‌పై ఆర్‌సీబీ వేటు..?

IPL 2026: అత్యాచార కేసు.. యశ్ దయాల్‌పై ఆర్‌సీబీ వేటు..?

ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడనే ఆరోపణలతో యశ్ దయాల్‌పై జైపూర్‌లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా యశ్ దయాల్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను స్పెషల్ పోక్సో కోర్టు తిరస్కరించింది. ఓవైపు న్యాయపరమైన విచారణ కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు తన కెరీర్‌ను పునర్నిర్మించుకునే ప్రయత్నంలో యశ్ దయాల్ ఉన్నాడు.

Story first published: Monday, July 27, 2026, 15:06 [IST]
Other articles published on Jul 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+