For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB IPL 2025 Schedule: బద్ద శత్రువుతో తొలి మ్యాచ్.. రజత్ సేన పూర్తి షెడ్యూల్ ఇదే!

భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 సీజన్ షెడ్యూల్‌ విడుదలైంది. ఈ సారి చాలా ముందుగానే క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. మార్చి 22నుంచి మే 25 వరకు ఈ ధనాధన్ లీగ్ సాగనుంది. మొత్తం 65 రోజుల పాటు 74 మ్యాచ్‌లతో అభిమానుల్ని ఐపీఎల్ అలరించనుంది. ఈ షెడ్యూల్ వివరాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ శనివారం ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఐకానిక్ ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

భారత్ X పాక్ తరహాలోనే..
ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి కేకేఆర్ చిరకాల ప్రత్యర్థి. ఇరు జట్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆర్‌సీబీ సారథి విరాట్ కోహ్లీతో గొడవ పడటంతో ఇరు జట్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆర్‌సీబీ X కేకేఆర్ పోరును ఇరు జట్ల అభిమానులు భారత్-పాక్ పోరు తరహాలోనే భావిస్తారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకే బీసీసీఐ.. ఐపీఎల్ 2025 సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఈ ఇరు జట్ల మధ్య షెడ్యూల్ చేసింది.

RCB IPL 2025 Full Schedule RCB to face KKR in opening match on March 22 at Eden Gardens

రజత్ పటీదార్ కెప్టెన్సీలో..
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఆర్‌సీబీ తమ సారథిగా టీమిండియా యువ బ్యాటర్ రజత్ పటీదార్‌ను నియమించింది. పెద్దగా అనుభవం లేని రజత్ పటీదార్‌కు విరాట్ కోహ్లీ అండగా నిలిచినట్లు తెలుస్తోంది. అతని సూచనలతోనే రజత్ పటీదార్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కోహ్లీ సైతం సీనియర్ ఆటగాళ్లుగా రజత్ పటీదార్‌కు అండగా నిలుస్తామని తెలిపాడు. గత 17 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆర్‌సీబీ.. రజత్ పటీదార్ సారథ్యంలోనైనా ఆ కల నేర్చుకోవాలని భావిస్తోంది.

బెంగళూరులో 7 మ్యాచ్‌లు..
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్రతీ జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడుతాయి. హోమ్ గ్రౌండ్‌లో ,ప్రత్యర్థి వేదికపై ఏడేసి మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతాయి. బెంగళూరు వేదికగా ఆర్‌సీబీ ఏడు మ్యాచ్‌లు ఆడనున్నాయి. కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్‌లతో రెండేసి సార్లు తలపడనున్న ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో ఒక్కోసారి మాత్రమే ఆడుతోంది.

ఆర్‌సీబీ షెడ్యూల్ ఇదే..
మార్చి 22: కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ(ఈడెన్ గార్డెన్స్-కోల్‌కతా)-రాత్రి 7.30 గంటలకు

మార్చి 28: సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ(చెపాక్ మైదానం-చెన్నై)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 2: ఆర్‌‌సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్(చిన్నస్వామి స్టేడియం-బెంగళూరు)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 7: ముంబై వర్సెస్ ఆర్‌సీబీ(వాంఖడే-ముంబై)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 10: ఆర్‌‌సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్(చిన్నస్వామి స్టేడియం-బెంగళూరు)-రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 13: రాజస్థాన్ వర్సెస్ ఆర్‌సీబీ(సావాయ్ మాన్‌సింగ్ స్టేడియం-ముంబై)- మధ్యాహ్నం 3.30 గంటలకు

ఏప్రిల్ 18: ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్(చిన్నస్వామి స్టేడియం-బెంగళూరు)- రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 20: పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ(మహరాజ యదవింద్ర సింగ్ స్టేడియం-ముల్లాన్‌పూర్)- మధ్యామ్నం 3.30 గంటలకు

ఏప్రిల్ 24: ఆర్‌సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్(చిన్న స్వామి స్టేడియం-బెంగళూరు)- రాత్రి 7.30 గంటలకు

ఏప్రిల్ 27: ఢిల్లీ వర్సెస్ ఆర్‌సీబీ(అరుణ్ జైట్లీ స్టేడియం-ఢిల్లీ)- రాత్రి 7.30 గంటలకు

మే 3: ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే(చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)-రాత్రి 7.30 గంటలకు

మే 9: లక్నో వర్సెస్ ఆర్‌సీబీ-(ఎకాన క్రికెట్ స్టేడియం, లక్నో)-రాత్రి 7.30 గంటలకు

మే 13: ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజర్స్- (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)-రాత్రి 7.30 గంటలకు

మే 17: ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్-చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు- రాత్రి 7.30 గంటలకు

Story first published: Monday, February 17, 2025, 9:57 [IST]
Other articles published on Feb 17, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+