Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: బలహీనంగా ఆర్‌సీబీ.. పూర్తి జట్టు ఇదే!

ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తీవ్రంగా నిరాశపరిచింది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు సాగిన మెగా వేలంలో ఆశించిన రీతిలో ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. రూ. 83 కోట్ల భారీ పర్స్‌తో వేలంలోకి అడుగుపెట్టిన ఆర్‌సీబీ.. దూకుడుగా యాక్టివ్‌గా ఆటగాళ్లను కొనుగోలు చేయలేదు.

కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్‌ను తిరిగి కొనుగోలు చేయడంతో పాటు రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద సిరాజ్, మ్యాక్స్‌వెల్‌ను తీసుకుంటారని భావించగా.. ఆర్‌సీబీ మాత్రం వారి గురించి కనీసం బిడ్ కూడా వేయలేదు. ఆర్‌టీమ్ కార్డ్ ఉపయోగించుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. మూడు ఆర్‌టీమ్ కార్డ్స్‌ను సద్వినియోగం చేసుకోలేదు. కనీసధరలకే మాజీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న కొనుగోలు చేయలేదు. టీమ్ మొత్తాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉన్న ఆర్‌సీబీ పూర్తిగా కొత్త ఆటగాళ్లను మాత్రమే తీసుకుంది.

RCB IPL 2025 Final Squad

వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్‌ను మాత్రమే అంటిపెట్టుకున్న ఆర్‌సీబీ.. వేలంలో పూర్తిగా కొత్త ఆటగాళ్లనే కొనుగోలు చేసింది. జోష్ హజెల్ వుడ్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మల కోసం భారీగా ఖర్చు చేసింది. వేలంలో మొత్తం 19 మంది ఆటగాళ్లనే కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. జోష్ హజెల్ వుడ్ కోసం అత్యధికంగా రూ.12.50 కోట్లు ఖర్చు చేసింది.

ఆర్‌సీబీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

లియామ్ లివింగ్ స్టోన్(రూ. 8.75 కోట్లు), ఫిల్ సాల్ట్(రూ. 11.50 కోట్లు), జితేశ్ శర్మ(రూ. 11 కోట్లు), జోష్ హజెల్ వుడ్(రూ. 12.50 కోట్లు), రసిక్ ధార్(రూ. 6 కోట్లు), సుయాశ్ శర్మ(రూ. 2.6 కోట్లు), కృనాల్ పాండ్యా(రూ. 5.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ. 10.75 కోట్లు), స్వప్నిల్ సింగ్(రూ. 50 లక్షలు), టీమ్ డేవిడ్(రూ. 3 కోట్లు), రోమారియో షెఫర్డ్(రూ. 1.5 కోట్లు), నువాన్ తుషారా(రూ. 1.6 కోట్లు), మనోజ్(రూ. 30 లక్షలు), జాకోబ్ బెతెల్(రూ. 2.6 కోట్లు), దేవదత్ పడిక్కల్(రూ. 2 కోట్లు), స్వస్తిక్ చికార(రూ. 30 లక్షలు), లుంగి ఎంగిడి(రూ. కోటి), అభినందన్ సింగ్(రూ. 30 లక్షలు), మోహిత్ రతీ(రూ. 30 లక్షలు)

ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్:
విరాట్ కోహ్లీ(రూ. 21 కోట్లు), రజత్ పటీదార్(రూ. 11 కోట్లు), యశ్ దయాల్(రూ. 5 కోట్లు)

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా):
విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ(కీపర్), టీమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ సలామ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్.

Story first published: Monday, November 25, 2024, 23:55 [IST]
Other articles published on Nov 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+