Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: బలహీనంగా ఆర్‌సీబీ బౌలింగ్.. తుది జట్టు అంచనా ఇదే!

ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరోసారి తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. తమకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ప్రకారం.. కావాల్సిన ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. ముఖ్యంగా ప్రతిభ కలిగిన దేశవాళీ క్రికెటర్లను కొనుగోలు చేయలేకపోయింది. మళ్లీ స్టార్ డమ్ కలిగిన ప్లేయర్ల కోసమే పరుగెత్తి బొక్క బోర్లా పడింది. రూ. 23.25 కోట్ల బడ్జెట్‌తో ఐపీఎల్ వేలం బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. వదులుకున్న ఆటగాళ్ల స్థానాలను కూడా భర్తీ చేయలేకపోయింది.

వేలంలోకి వానిందు హసరంగ, హర్షల్‌ పటేల్, జోష్ హేజిల్‌వుడ్‌, ఫిన్‌ అలెన్‌, మైకేల్ బ్రేస్‌వెల్‌, డేవిడ్ విల్లీ, పార్నెల్‌, సోను యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, అవినాశ్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్‌లను వదిలేసిన ఆర్‌సీబీ.. వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను తీసుకోలేకపోయింది. హజెల్ వుడ్ స్థానంలో మరో స్టార్ పేసర్‌ను కొనుగోలు చేయలేకపోయింది.

RCB IPL 2024 Squad: Royal Challengers Bangalore Full List of Players after Auction and Playing XI

ప్యాట్ కమిన్స్ కోసం ప్రయత్నించినా.. సన్‌రైజర్స్ పోటీపడటంతో వెనుకడుగు వేసింది. చివరకు గత్యంతరం లేక వెస్టిండీస్ పేస్ ఆల్‌రౌండర్ అల్జారీ జోసెఫ్‌ను రూ. 11.50 కోట్లు భారీ ధరకు తీసుకుంది. అన్‌సోల్డ్ లిస్ట్‌కు చేరువైన లాకీ ఫెర్గూసన్, టామ్‌కరన్‌లను చివర్లో తీసుకుంది. ఒకే ఓవర్‌లో ఐదు సిక్స్‌లు సమర్పించుకున్న టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేసింది.

ఆర్‌సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లను చూసి సొంత అభిమానులే తీవ్ర నిరాశకు గురయ్యారు. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, రజత్ పటిదార్‌లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నా.. బౌలింగ్ మాత్రం బలహీనంగా కనబడుతోంది. ధారళంగా పరుగులిచ్చే మహమ్మద్ సిరాజ్ నేతృత్వంలోని ఆర్‌సీబీ పేస్ విభాగం ఎలా రాణిస్తుందో చూడాలి.

స్పిన్ విభాగం పూర్తిగా గ్లేన్ మ్యాక్స్‌వెల్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్ ఆర్డర్ చెలరేగి.. బౌలర్లు సంచలన ప్రదర్శన కొనసాగిస్తే ఆర్‌సీబీ విజేతగా నిలుస్తోంది. లేకుంటే మరో సీజన్ కాలగర్భంలో కలిసిపోతుంది.

RCB IPL 2024 Squad: Royal Challengers Bangalore Full List of Players after Auction and Playing XI


ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లేన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరూన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
అల్జారి జోసెఫ్‌ (రూ. 11.50 కోట్లు), యశ్‌ దయాల్‌ (రూ. 5 కోట్లు), ఫెర్గూసన్‌ (రూ. 2 కోట్లు), టామ్‌ కరన్‌ (రూ. 1.50 కోట్లు), సౌరభ్‌ చౌహాన్‌ (రూ. 20 లక్షలు), స్వప్నిల్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు)

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, మయాంక్ దగార్/సుయాష్ ప్రభుదేశాయ్, అల్జారీ జోసెఫ్/రీస్ టోప్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్/ఆకాశ్ దీప్, కర్ణ్ శర్మ

Story first published: Sunday, December 31, 2023, 11:28 [IST]
Other articles published on Dec 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+