Glenn Maxwell:మరోసారి పెళ్లి చేసుకున్న ఆర్‌సీబీ హిట్టర్ (వీడియో)

సిడ్నీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్.. తన ప్రేయసి వినీ రామన్‌ను మరోసారి పెళ్లి చేసుకున్నాడు. 10 రోజుల క్రితమే (మార్చి 18) తమ 9 ఏళ్ల ప్రేమ బంధానికి తెరదించుతూ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన మ్యాక్సీ.. తాజాగా భారత సంప్రదాయం ప్రకారం కూడా చేసుకున్నాడు. ఇండియన్ ట్రెడిషన్ ఔట్ ఫిట్‌లో ఉన్న మ్యాక్సీ, వినీ రామన్ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
షేర్వాణీ,చీరకట్టులో..
ఆ వీడియోలో మ్యాక్స్‌వెల్ షేర్వాణీలో కనిపించగా.. వినీ రామన్ సంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకొని కనిపిస్తోంది. బ్యాక్‌రౌండ్ మ్యూజిక్(సన్నాయి మేళం), వారి దుస్తులను బట్టి చూస్తే ఈ వివాహం తమిళ బ్రాహ్మణ పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరూ డ్యాన్స్ చేస్తూ దండలు మార్చుకున్నారు.
క్రిస్టియన్ సంప్రదాయంలో వివారం జరిగిన అనంతరం రింగులు మార్చుకున్న ఫోటోను మ్యాక్స్ షేర్ చేశాడు. దానికి 'లవ్ అనే పదాన్ని ఈ రోజుతో పూర్తి చేశాను. ఒక పెద్ద ఘట్టం ముగిసింది.. కొత్త జీవితం ఆరంభమవుతుంది'అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

వలస వెళ్లిన తమిళ కుటుంబం..
అటు మ్యాక్సీ సతీమణి వినీ రామన్ సైతం ఇన్‌స్టా వేదికగా తమ పెళ్లి విషయాన్ని తెలియజేసింది. మ్యాక్సీతో లిప్‌లాక్ ఫొటోను షేర్ చేసిన వినీ రామన్.. దానికి '18.03.2022.. మిస్టర్ అండ్ మిసేస్ మ్యాక్సీ'అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక మ్యాక్స్‌వెల్ సతీమణి వినీ రామన్ భారత సంతతి అన్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడింది. ఈ ఇద్దరూ గత 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నిజానికి వీరి వివాహం గతేడాదే జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. నిశ్చితార్ధం మాత్రం గతేడాదే భారత సంప్రదాయం ప్రకారం జరిగింది.


మరో వారం రోజుల్లో..
ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందే ఆర్‌సీబీ.. మ్యాక్స్‌వెల్‌ను రూ.11 కోట్లతో రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలోనే మ్యాక్సీ పాకిస్తాన్ టూర్‌తో పాటు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. మరో వారం రోజుల్లో మ్యాక్సీ ఆర్‌సీబీతో కలిసే అవకాశం ఉంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. భారీ స్కోర్ చేసినా పేలవ ఫీల్డింగ్, చెత్త బౌలింగ్‌తో ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications