Glenn Maxwell: ప్రేయసిని పెళ్లాడిన ఆర్‌సీబీ విధ్వంసకర బ్యాట్స్‌మన్!


సిడ్నీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విధ్వంసకర బ్యాట్స్‌మన్, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఓ ఇంటి వాడయ్యాడు. గత కొన్నేళ్లుగా ప్రేమ బంధంలో మునిగి తేలుతున్న తన ప్రేయసి, భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను శనివారం పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్సీనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రపంచానికి తెలియజేశాడు. రింగులు మార్చుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. 'లవ్ అనే పదాన్ని ఈ రోజుతో పూర్తి చేశాను. ఒక పెద్ద ఘట్టం ముగిసింది.. కొత్త జీవితం ఆరంభమవుతుంది'అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.
మిస్టర్ అండ్ మిసెస్ మ్యాక్సీ..
అటు మ్యాక్సీ సతీమణి వినీ రామన్ సైతం ఇన్‌స్టా వేదికగా తమ పెళ్లి విషయాన్ని తెలియజేసింది. మ్యాక్సీతో లిప్‌లాక్ ఫొటోను షేర్ చేసిన వినీ రామన్.. దానికి '18.03.2022.. మిస్టర్ అండ్ మిసేస్ మ్యాక్సీ'అనే క్యాప్షన్ ఇచ్చింది. ఇక వివాహబంధంతో ఓ ఇంటివాడైన మ్యాక్స్‌వెల్‌కు ఆర్‌సీబీతో పాటు అభిమానులు, స్టార్ ప్లేయర్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'మ్యాక్సీ, వినీ రామన్ పెళ్లి పట్ల ఆర్‌సీబీ ఫ్యామిలీ సంతోషంగా ఉంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరికి ఆల్ ది బెస్ట్.. మీ జీవితం హయిగా, ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాం'అంటూ ట్వీట్ చేసింది.
9 ఏళ్ల ప్రేమాయణం..
ఇక టీమిండియా స్టార్ ప్లేయర్స్ గ్లేన్ మ్యాక్స్‌వెల్, కేఎల్ రాహుల్ మ్యాక్సీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మ్యాక్స్‌వెల్ సతీమణి వినీ రామన్ భారత సంతతి అన్న విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడ స్థిరపడింది. ఈ ఇద్దరూ గత 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి సంబంధించిన తమిళ వెడ్డింగ్ కార్డ్ ఒకటి ఆ మధ్య నెట్టింట వైరల్ అయింది. పెళ్లి పత్రికను బట్టి చూస్తే వీరి వివాహం తమిళ, క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరగనుందని అర్థమైంది.

గతేడాదే జరగాల్సి ఉన్నా..
మాక్స్‌వెల్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వాడు కాగా, వినీ రామన్ తమిళ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ క్రమంలోనే క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మరీ తమిళ సంప్రదాయం ప్రకారం కూడా చేసుకుంటారా? అనేదానిపై స్పష్టత లేదు. నిజానికి వీరి వివాహం గతేడాదే జరగాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. నిశ్చితార్ధం మాత్రం గతేడాదే భారత సంప్రదాయం ప్రకారం జరిగింది.

ఆర్‌సీబీ ఆరంభ మ్యాచ్‌లకు దూరం..
ఇక ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి ముందే ఆర్‌సీబీ.. మ్యాక్స్‌వెల్‌ను రూ.11 కోట్లతో రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి నేపథ్యంలోనే మ్యాక్సీ పాకిస్తాన్ టూర్‌కు దూరంగా ఉన్నాడు. మరో వారంలో ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానుండడంతో మ్యాక్సీ నేరుగా ఆర్‌సీబీ జట్టుతో కలవనున్నాడు. ఈ క్రమంలోనే అతను ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications