IPL 2024: అంబటి రాయుడు యూటర్న్.. పూటకో మాట!
ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)పై తన అక్కసు వెళ్లగక్కిన టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు యూటర్న్ తీసుకున్నాడు. మొన్న చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆర్‌సీబీ సాధించిన విజయాన్ని రాయుడు ఎగతాళి చేసిన విషయం తెలిసిందే.
ప్లే ఆఫ్స్ చేరితేనే ఆర్‌సీబీ, ఆ జట్టు అభిమానులు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చాడు. అంతేకాకుండా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోవాలని కూడా కోరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఆర్‌సీబీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టార్ స్పోర్ట్స్ షోలో సహచర కామెంటేటర్ వరుణ్ అరుణ్.. ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని చెప్పగా.. రాయుడు ఎగతాళి చేశాడు. ఇప్పటికే టైటిల్ గెలిచిందనే రీతిలో సంబరాలు చేసుకుంటున్నారని ఆర్‌సీబీ విజయాన్ని తక్కువ చేసి మాట్లాడాడు.
ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోతుందని కూడా చెప్పాడు. క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా కూడా రాయుడు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ సారి సౌత్ టీమ్ టైటిల్ గెలుస్తుందని, ఆర్‌సీబీ విజేతగా నిలుస్తుందని దిగ్గజ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ అనగా.. రాయుడు అతని వ్యాఖ్యలతో ఏకీభవించాడు.
కానీ ఆర్‌సీబీ గెలవదని చెప్పాడు. ఐపీఎల్ 2024 టైటిల్‌ను సౌత్ టీమ్ గెలుస్తుందని, కానీ ఆర్‌సీబీ మాత్రం కాదని, సన్‌రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలుస్తుందని చెప్పాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ నేపథ్యంలో రాయుడు యూటర్న్ తీసుకున్నాడు. ఆర్‌సీబీ టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు.
'ఆర్‌సీబీ టైటిల్ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సారి ఆ జట్టుకు మంచి అవకాశం దక్కింది. సీఎస్‌కే కూడా లేదు. కాబట్టి ఆ జట్టు మరో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా.'అని తెలిపాడు. అయితే రాయుడు పూటకో మాట మాట్లాడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications