Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: శతక్కొట్టిన ఆర్‌సీబీ ఆల్‌రౌండర్.. సంతోషంలో ఫ్యాన్స్!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(155 బంతుల్లో 16 ఫోర్లతో 103 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 279 పరుగులు చేసింది.

కామెరూన్ గ్రీన్ తర్వాత మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 40) టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గ్రీన్‌తో పాటు క్రీజులో జోష్ హజెల్ వుడ్(0 బ్యాటింగ్) ఉన్నాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(4/43) నాలుగు వికెట్లు తీయగా.. విలియమ్ ఓ రూర్కీ, స్కాట్ కుగ్గెలెజిన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్రకు ఓ వికెట్ దక్కింది.

RCB fans Reactions after Cameron Green century rescues Australia in first Test against New Zealand

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు స్టీవ్ స్మిత్(31), ఉస్మాన్ ఖవాజా(33) శుభారంభమే అందించారు. కానీ ఈ జోడీని మ్యాట్ హెన్రీ విడదీసాడు. నిలకడగా ఆడుతున్న స్టీవ్ స్మిత్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 61 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత వచ్చిన మార్నస్ లబుషేన్(1) స్కాట్ కుగ్గెలెజిన్ క్యాచ్ ఔట్ చేయగా.. ఉస్మాన్ ఖవాజాను హెన్రీ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే ట్రావిస్ హెడ్(1)‌ను ఓ రూర్కీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆసీస్ 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మిచెల్ మార్ష్‌తో కామెరూన్ గ్రీన్ జట్టును ఆదుకున్నాడు. 67 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని హెన్రీ విడదీసాడు. దాంతో ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓవైపు అలెక్స్ క్యారీ(10), మిచెల్ స్టార్క్(9), ప్యాట్ కమిన్స్(16), నాథన్ లయన్(5) విఫలమవ్వగా.. మరోవైపు ఆచితూచి ఆడిన కామెరూన్ గ్రీన్ 154 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

టెయిలెండర్లతో స్వల్ప భాగస్వామ్యాలు నమోదు చేసిన కామెరూన్ గ్రీన్.. జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు కామెరూన్ గ్రీన్.. ట్రేడింగ్ ద్వారా ఆర్‌సీబీ జట్టులోకి వచ్చాడు. అతని ధర రూ. 17.5 కోట్లు చెల్లించి మరీ ఆర్‌సీబీ గ్రీన్‌ను తీసుకుంది. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2024 సీజన్‌లో కామెరూన్ గ్రీన్ ఇదే జోరు కొనసాగిస్తే.. ఆర్‌సీబీకి తిరుగుండదని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, February 29, 2024, 14:30 [IST]
Other articles published on Feb 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+