Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్‌సీబీ బ్యాటర్ విధ్వంసం.. 41 బంతుల్లోనే శతకం! (వీడియో)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విల్ జాక్స్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. మినీ ఐపీఎల్‌ను తలపించే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విల్ జాక్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

41 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న విల్ జాక్స్.. సౌతాఫ్రికా టీ20లో వేగవంతమైన శతకం నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. విల్ జాక్స్ విధ్వంసకర శతకంతో ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో గెలుపొందింది.

RCB Fans Reaction after Will Jacks smashes fastest century in SA20 history

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. జాక్స్‌కు తోడుగా కొలిన్ ఇన్‌గ్రామ్(43) పరుగులతో రాణించాడు. సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఆర్‌సీబీకే చెందిన రీస్ టోప్లీ మూడు వికెట్లు తీయగా.. కేశవ్ మహరాజ్, మార్కస్ స్టోయినీస్, జూనియర్ డాలా, కీమో పాల్, డ్వేన్ ప్రిటోరియస్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్‌కే(33), క్వింటన్ డికాక్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బౌలింగ్‌లో విల్ జాక్స్(2/18) రెండు వికెట్లు పడగొట్టాడు. అతనితో పాటు వ్యాన్ పార్నెల్, హర్డస్ విజియోన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. జేమ్స్ నీషమ్ ఓ వికెట్ పడగొట్టాడు.

RCB Fans Reaction after Will Jacks smashes fastest century in SA20 history

ఆర్‌సీబీ చెందిన ఆటగాళ్లు పలు టోర్నీల్లో నిలకడగా ప్రదర్శన చేస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండటంతో ఆ జట్టు అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. రజత్ పటీదార్, విరాట్ కోహ్లీ, సుయాష్ ప్రభుదేశాయ్‌లు పరుగుల వరద పారిస్తుండగా.. తాజాగా విల్ జాక్స్ వారితో జత కలిసాడని ఆర్‌సీబీ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

గత 17 ఏళ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆర్‌సీబీ ఈ సారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తోంది. వేలంలో తీవ్రంగా నిరాశపరిచిన ఆర్‌సీబీ.. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోలేకపోయింది. ఫ్రంట్‌లైన్ పేసర్‌తో పాటు స్పిన్నర్ లేకపోవడంతో ఆ జట్టు బలహీనతగా మారింది. విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్నా.. ఆ స్థాయిలో బౌలింగ్ లేదు. మహమ్మద్ సిరాజ్‌, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Story first published: Friday, January 19, 2024, 11:09 [IST]
Other articles published on Jan 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+