Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ అంటే పిచ్చి.. నా ఫేవరేట్ క్రికెటర్ అతనే: రష్మిక మందన

RCB fan and actress Rashmika Mandanna reveals her favourite cricketer

హైదరాబాద్: క్రికెట్ అంటే తనకు పిచ్చని టాలీవుడ్ హీరోయిన్ రష్మీక మందాన తెలిపింది. ప్రస్తుతం కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ కన్నడ బ్యూటీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది. వరుస ఆఫర్స్‌తో తీరిక లేకుండా గుడుపుతోంది. ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటుందంట. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. అవకాశం దొరికినప్పుడల్లా క్రికెట్ చూడడానికి ఇష్టపడుతుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మకు 'మీ ఫెవరేట్ క్రికెటర్ ఎవరు..?'అనే ప్రశ్న ఎదురైంది. వెంటనే రష్మిక.. " నా హీరో మహేంద్ర సింగ్ ధోనీ " అంటూ బదులిచ్చింది.'ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ .. అంటే చాలా ఇష్టమని, పడి చచ్చిపోతానని, అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్.' అంటూ చెప్పుకొచ్చింది.. అయితే తన ఫేవరెట్ ఐపీఎల్ జట్టు గురించి అడిగితే మాత్రం.

RCB fan and actress Rashmika Mandanna reveals her favourite cricketer

"ఈ సాలా కప్ నమ్‌దే" అంటూ సొంత రాష్ట్రానికి చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అని తెలిపింది. గతంలో కూడా ఈ కన్నడ బ్యూటీ క్రికెట్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆర్‌సీబీకి సపోర్ట్ చేసింది. దాంతో రష్మీక ఫేవరేట్ హీరో విరాట్ కోహ్లీ అనుకున్నారంత. కానీ ఈ ముద్దుగుమ్మ ధోనీ అంటే ఇష్టమని తెలిపి విరాట్ ఫ్యాన్స్ మనసులను గాయపరిచింది.

ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్న రష్మిక, తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీలో అరడజనుకు పైగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక బాలీవుడ్‌లో డెడ్లీ, మిషన్ మజ్ను వంటి వరుస సినిమాలలో నటించనుండగా.. హిందీలో మరో అవకాశాన్ని కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ప్లాన్ చేస్తున్న సుకుమార్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక మందన.. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు అందుకుంది.

Story first published: Friday, May 14, 2021, 17:28 [IST]
Other articles published on May 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+