For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెట్టిన ఆర్‌సీబీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ పేసర్ యష్ దయాల్ వ్యక్తిగత కారణాల‌తో ఐపీఎల్ 2026 సీజన్‌ ఆడటం లేదని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ అన్నారు. మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సీజన్‌కు దూరమైనా.. యశ్ దయాల్ ఆర్‌సీబీతో కాంట్రాక్ట్‌లోనే ఉన్నాడని పేర్కొన్నారు.

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యశ్ దయాల్‌పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జైపూర్‌లో ఓ కేసు నమోదైంది. ఐపీఎల్ 2025 సీజన్ సమయంలో హోటల్‌లో కూడా సదరు అమ్మాయిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జైపూర్ పోక్సో కోర్టు తిరస్కరించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ల పాటు శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడని ఘజియాబాద్‌కు చెందిన మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అతని అరెస్టుపై స్టే ఇచ్చింది.

RCB director Mo Bobat Confirm Yash Dayal Will Not Play IPL 2026 Amid Legal Battle

ఈ సీజన్ ఆడటం లేదు..

ఈ కేసుల నేపథ్యంలోనే యశ్ దయాల్‌ను జట్టుకు దూరంగా ఉంచాలని ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ నిర్ణయించిందని మో బోబాట్ పేర్కొన్నారు. 'యష్ దయాల్ ఈసారి జట్టులో చేరడం లేదు. అతను కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నాడనే విషయం మీ అందరికి తెలిసిందే. యష్ దయాల్‌కు మేం ఇప్పటి వరకు ఎంతో అండగా నిలిచాం. ఇందులో భాగంగానే అతన్ని వేలంలోకి వదిలేయకుండా రిటైన్ చేసుకున్నాం.

మేం అతన్ని జట్టులో కొనసాగించాలని అనుకున్నాం. అతను ఇప్పటికీ ఆర్‌సీబీ కాంట్రాక్ట్‌లోనే ఉన్నాడు. మేం అతనితో రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం. ఈ రోజు ఉదయం కూడా నేను అతనితో మాట్లాడాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతను జట్టులో చేరడం జట్టుకు, అతనికి శ్రేయాస్కారం కాదని భావించి ఈ సీజన్‌కు దూరంగా ఉంచాలని నిర్ణయించాం. అతనికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అతను ఈ సమస్య నుంచి బయటపడే వరకు మేం అతనితో టచ్‌లోనే ఉంటాం.'అని మో బోబాట్ స్పష్టం చేశారు. ఐపీఎల్ 2025 సీజన్‌లో యశ్ దయాల్ 13 వికెట్లతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని గైర్హాజరీ జట్టు తీరని లోటు అని చెప్పవచ్చు.

సీక్రెట్‌గా పెళ్లి..

ఇటీవలే యాష్ దయాల్ కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండిర్‌ను సీక్రేట్‌గా వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 4న సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఈ జంట తమ వివాహం గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, శ్వేతా పుండిర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యశ్ దయాల్‌తో గడిపిన కొన్ని క్షణాలతో కూడిన ఒక చిన్న వీడియో రీల్‌ను పంచుకున్నారు.

Story first published: Tuesday, March 24, 2026, 14:47 [IST]
Other articles published on Mar 24, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+