
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ఫీవర్ మొదలైంది. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ మొదలుపెట్టాయి. తమ ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నాయి. తాజాగా రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)జట్టు ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది.
ఆ వీడియో ఏంటంటే.. ఆర్‌సీబీ బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫ్ఫిత్ బౌలర్ల సామర్థ్యానికి ఓ పరీక్ష పెట్టాడు. వారందరికి యార్కర్ చాలెంజ్ విసిరాడు. ఈ సవాల్‌ను ఆర్‌సీబీ బౌలర్లంతా స్వీకరించి పూర్తి చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా ఇతర ఆటగాళ్లు వారిని అభినందించారు. ఈ క్రమంలో అల్లరి అల్లరి చేశారు. తమ ప్రాక్టీస్ సెషన్‌ను ఎంతో ఆస్వాదించారు.
బౌలింగ్ కోచ్ విధించిన యార్కర్స్ చాలెంజ్‌లో ముందుగా క్రీజును దీర్ఘచతురస్రాకారంలో వికెట్లతో కవర్ చేశారు. మధ్యలో రెడ్ మార్క్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పర్ఫెక్ట్ యార్కర్ వేస్తూ ముందున్న రెడ్ మార్కర్స్‌ను హిట్ చేస్తే ఐదు పాయింట్లని, మిగతా వాటిని చేస్తే తక్కువ పాయింట్లని చెప్పారు. ఆర్‌సీబీ బౌలర్లలో ఒక్కొక్కరు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుంధర్, మహ్మద్ సిరాజ్ పర్ఫెక్ట్ యార్కర్లు వేసారు. ఇక సిరాజ్ వేసిన సూపర్ యార్కర్‌కు ఇంప్రెస్ అయిన కోహ్లీ అమాంతం అతనిపైకి ఎక్కి హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇక గత 12 సీజన్లుగా ఆర్‌సీబీకి టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రెండు సార్లు (2009, 2016) ఫైనల్‌కు వెళ్లిన ఆ జట్టు తృటిలో అవకాశాన్ని చేజార్చుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసితో బరిలోకి దిగుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సెప్టెంబర్ 21న తొలి మ్యాచ్ ఆడనుంది.