Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020లో 150-160 స్కోర్లు సరిపోతాయ్‌: ఆర్‌సీబీ కోచ్‌

RCB coach Mike Hesson feels A score of 15-160 on UAE tracks will be good one

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం చాలా తక్కువని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కోచ్ మైక్ హసన్ అభిప్రాయపడ్డారు. దుబాయ్‌, అబుదాబి వంటి పిచ్‌లపై 150-160 పరుగులు చేస్తే సరిపోతుందని అంచనా వేశారు. యూఏఈ మైదానాల్లో బౌండరీ సరిహద్దులు పెద్దవి కావడంతో సగటు స్కోర్లు తగ్గే అవకాశం ఉందన్నారు. చివరి ఓవర్ల బౌలర్లను గుర్తించామని, విదేశీ బౌలర్లు రావడంతో తమ బౌలింగ్‌ దాడి మరింత పదును తేలిందని మైక్ హసన్ ధీమా వ్యక్తం చేశారు.

 150-160 మంచి స్కోరు:

150-160 మంచి స్కోరు:

ఆర్‌సీబీ యూట్యూబ్‌ షో బోల్డ్‌ డైరీస్‌లో మైక్ హసన్ మాట్లాడుతూ... 'యూఏఈ మైదానాల్లో 150-160 స్కోర్లు చేయడం ఎక్కువే అని నా అభిప్రాయం. బెంగళూరులోని చిన్నస్వామి మైదానం బ్యాటింగ్‌ పిచ్‌. అక్కడ బౌండరీ సరిహద్దులు కూడా చిన్నవే. అందుకే చిన్నస్వామిలో ఎక్కువ స్కోర్లు నమోదవుతాయి. సాధారణంగా మందకొడిగా ఉండే పిచ్‌లపై స్పిన్నర్లు కీలకం అవుతారు. దుబాయ్‌, షార్జాలో వారు ప్రభావం చూపిస్తారు. అబుదాబి మాత్రం పేసర్లకు సహకరిస్తుంది. అందుకే మేం పరిస్థితులకు అలవాటు పడాలి' అని అన్నారు.

డెత్‌ బౌలర్లను గుర్తించాం:

డెత్‌ బౌలర్లను గుర్తించాం:

చిన్నస్వామితో పోలిస్తే అబుదాబిలో డెత్ ‌బౌలింగ్‌ భిన్నంగా ఉంటుందని మైక్ హెసన్‌‌ తెలిపారు. అయితే ఆ లెంగ్త్‌లను దొరకబుచ్చుకొనే డెత్‌ బౌలర్లను గుర్తించామన్నారు. చాలా సమయం సమీక్షలు చేసి తమ బలాబలాలు విశ్లేషించుకున్నామని ఆయన చెప్పారు. ఎవరిని అట్టిపెట్టుకోవాలి? అంతరాలు ఏమటి? పూడ్చుకొనేందుకు ఏం చేయాలి? వంటి సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. గతంలో తమ డెత్‌ బౌలింగ్‌పై అందరికీ అనుమానాలు ఉండేవని, తాము తెలివిగా కొందరు బౌలర్లను తీసుకున్నామని తెలిపారు.

 పటిష్టంగా పేస్ విభాగం:

పటిష్టంగా పేస్ విభాగం:

ఐపీఎల్ గత సీజన్లతో పోలిస్తే ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ విభాగం డేల్ స్టెయిన్, క్రిస్‌ మోరీస్‌లతో బలోపేతంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయిన బెంగళూరు.. ఈసారి వేలంలో ఆచితూచి అడుగులేసింది. కోచ్ మైక్ హసన్ తెలివిగా ఆటగాళ్లను తీసుకున్నాడు. అరోన్ ఫించ్, క్రిస్‌ మోరీస్, ఆడమ్ జంపా, డేల్ స్టెయిన్ తదితర అగ్రశ్రేణి క్రికెటర్లని తీసుకుని జట్టును బలోపేతం చేశాడు.

సన్‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తొలి మ్యాచ్:

సన్‌రైజర్స్‌ ‌హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తొలి మ్యాచ్:

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుంది. మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దుబాయ్, షార్జా, అబుదాబి వేదికల్లో మాత్రమే మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల షెడ్యూల్‌ని కూడా విడుదల చేసింది. సెప్టెంబర్‌ 21న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానం.. అయినా జట్టులో దక్కని చోటు!!

Story first published: Wednesday, September 9, 2020, 22:58 [IST]
Other articles published on Sep 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+