Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డివిలియర్స్ ‘సూపర్‌మ్యాన్ క్యాచ్’.. రీ క్రియేట్ చేసిన కోహ్లీ!

RCB Captain Virat Kohli Recreates AB De Villiers Famous Superman Catch

దుబాయ్‌: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లేయర్ ఏబీడివిలియర్స్ పట్టిన ఓ క్యాచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలోనే అద్భుత క్యాచ్‌గా నిలిచిపోయింది. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో బౌండరీ లైన్ వద్ద నిల్చున్న ఏబీడీ.. అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. సూపర్‌మ్యాన్ ఫీట్‌ను తలపించిన ఈ క్యాచ్ అప్పట్లో అందరిని ఆకట్టుకుంది.

అయితే తాజాగా ఈ సూపర్ క్యాచ్‌ను ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రీ క్రియేట్ చేశాడు. గురువారం సాయంత్రం జరిగిన ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో అచ్చం ఏబీడీలానే బౌండరీ లైన్ వద్ద నిలబడి క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఏబీడీ సూపర్ క్యాచ్‌తో పోలుస్తూ ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. 'కెప్టెన్ కోహ్లీ మాములుగానే ఏబీ సూపర్‌మ్యాన్ క్యాచ్ రీక్రియేట్ చేశాడు. గత సాయంత్రం ప్రాక్టీస్ సెషన్‌లో ఇలా బంతిని అందుకున్నాడు'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఇక ఈ క్యాచ్‌పై ఆర్‌సీబీ అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో కోహ్లీ ఫీల్డింగ్‌లో ఇరగదీస్తాడని కాలర్ ఎగరేస్తున్నారు.

సెప్టెంబర్‌ మొదటి వారంలో జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో కోహ్లీ డైవ్‌ కొట్టి క్యాచ్‌ పట్టిన వీడియోను ఆర్‌సీబీ షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆ వీడియోకు క్యాప్షన్‌ను కాస్త భిన్నంగా పెట్టింది. 'కోహ్లీ.. ఈ సమయంలో చెప్పడానికి ఏమీ లేదు. వదిలేద్దాం'అని కోహ్లీ డైవ్‌ను కొనియాడింది. సోమవారం ఆర్సీబీ తన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది.

Story first published: Saturday, September 19, 2020, 19:42 [IST]
Other articles published on Sep 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+