
కోహ్లీ ధర రూ.17 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీని ఆ ఫ్రాంచైజీ 2018 సీజన్‌లో రూ.17 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్న క్రికెటర్ కోహ్లీనే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మలకు దాదాపు రూ.15 కోట్లు అందుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ముంబై నాలుగు సార్లు రోహిత్ సారథ్యంలోనే కప్ అందుకుంది. చెన్నై కూడా ధోనీ నేతృత్వంలోనే మూడు టైటిల్స్ గెలుచుకుంది. ఇక బెంగళూరు మాత్రం ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. అయినా క్యాష్ రిచ్ లీగ్ సక్సెస్ ఫుల్ సారథులు రోహిత్, ధోనీల కంటే కోహ్లీనే ఎక్కువ ఆర్జిస్తుండం విశేషం.

లాయల్టీ బోనస్ కింద 2 కోట్లు
మాములుగా ఒక ఆటగాడిని రిటైన్ చేసుకుంటే.. ప్రాంచైజీ అతడికి రూ.15 కోట్లు అందిస్తుంది. ఆ లెక్క ప్రకారమే రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలకు రూ.15 కోట్లు అందుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ మాత్రం రూ.17 కోట్లు ఆర్జిస్తున్నాడు. అదనంగా రెండు రూ.2 కోట్లు ఎందుకు ఎక్కువంటే?.. కోహ్లీ ఐపీఎల్ మొదటినుంచి బెంగళూరు తరపున ఆడడమే. 'లాయల్టీ బోనస్' కింద కోహ్లీకి రూ.2 కోట్లు అదనంగా అందుతున్నాయి. చెన్నై ప్రాంచైజీ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కున సమయంలో రెండేళ్లు ధోనీ రైజింగ్ పూణే సూపర్ జాయింట్స్ జట్టుకు ఆడాడు. ఇక రోహిత్ శర్మ లీగ్ ఆరంభంలో మూడు సంవత్సరాలు దక్కన్ ఛార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.

177 మ్యాచ్‌లు.. 5,412 పరుగులు
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కే ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటి వరకూ 177 మ్యాచ్‌లాడి 131.61 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,412 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉండగా.. 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 113. అతని ఇన్నింగ్స్‌ల్లో 480 ఫోర్లు, 190 సిక్సర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ 2020 లీగ్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.

ఒక్క టైటిల్ లేదు
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అదే ఇప్పుడు విరాట్ కోహ్లీ సేనకి పెద్ద లోటు.
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సచిన్ .. 560 మంది విద్యార్థులకు విద్య, పోషకాహారం


Click it and Unblock the Notifications
