ప్రాక్టీస్‌ను ఆస్వాదిస్తున్నాం:
కొన్ని రోజుల క్రితం ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో కొన్ని మంచి క్యాచ్‌లు పట్టిన విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్‌లో దుమ్ములేపున్నాడు. రెండు వారాల ప్రాక్టీస్‌తో విరాట్ మంచి జోష్ మీద ఉన్నాడు. ఈ మేరకు వీడియోను ఆర్‌సీబీ ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఇప్పటికి కుదురుకున్నాం. మొదట్లో కొన్ని రోజులు కఠినంగా అనిపించింది. ఐదు నెలల తర్వాత ప్రాక్టీస్ చేయడంతో ఫీల్డ్‌లో భారంగా అనిపించింది. గాడిలో పడ్డాం. ఇప్పుడు ప్రాక్టీస్‌ను ఆస్వాదిస్తున్నాం. జట్టులోని అందరూ బాగా ఆడుతున్నారు' అని తెలిపాడు.

హిట్టింగ్ కోణాన్ని పరిశీలించాం:
'ఫీల్డ్‌లో హిట్టింగ్ కోణాన్ని ప్రధానంగా పరిశీలించాం. ఈ వికెట్‌పై పేస్ ఎలా ఉంటుందో అనే అంశాన్ని కూడా అర్ధం చేసుకున్నాం. ప్రస్తుతం మా టీమ్ పూర్తిస్థాయిలో పోరుకు సన్నద్ధం కావడం చాలా సంతోషంగా ఉంది' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్ కోసం కోహ్లీ సన్నద్ధమవుతున్న తీరును నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. ఐపీఎల్‌లో కోహ్లీ పరుగుల వరద పారించడం ఖాయమంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ టోర్నీ ఈ నెల 19న యూఏఈ వేదికగా ప్రారంభంకానుంది. 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ తలపడనుంది.

ఒకవైపు సాధన.. మరోవైపు మరమత్తులు:
విరాట్ కోహ్లీ ఒకవైపు సాధన చేస్తూనే.. మరోవైపు బ్యాట్‌లను సిద్ధం చేసుకుంటున్నాడు. బ్యాట్ హ్యాండిల్ బ్యాలెన్స్ కావడానికి కొద్దిగా కట్ చేశానని శుక్రవారం తాను పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపాడు. 'బ్యాట్ సమతుల్యతకు నాకు రెండు సెంటీమీటర్లు కూడా చాలా ముఖ్యమైనది. నా బ్యాట్‌లను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం' అని కోహ్లీ ట్విట్టర్‌లో తన పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టాడు. ఆర్‌సీబీ కెప్టెన్ తన బ్యాట్ హ్యాండిల్‌ను రంపంతో కోస్తూ మరమ్మతులు చేస్తున్నాడు.

ఒక్క టైటిల్ లేదు:
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అదే ఇప్పుడు విరాట్ కోహ్లీ సేనకి పెద్ద లోటు.


Click it and Unblock the Notifications

ఐపీఎల్‌లో ఆడనున్న తొలి అమెరికన్ క్రికెటర్ అతడే!!