Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో ఆడనున్న తొలి అమెరికన్ క్రికెటర్ అతడే!!

IPL 2020: Ali Khan becomes first American cricketer to join IPL

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ అమెరికన్ క్రికెటర్ ఆడబోతున్నాడు. ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్) తరపున అమెరికాకు చెందిన పేసర్ అలీ ఖాన్ ఆడనున్నట్లు ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫో ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ టోర్నీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ అమెరికన్ క్రికెటర్ ఆడడం ఇదే తొలిసారి. దీంతో ఐపీఎల్‌లో ఆడనున్న తొలి అమెరికన్ క్రికెటర్‌గా 29 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ రికార్డుల్లోకి ఎక్కనున్నాడు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్ పేసర్ హ్యారీ గార్నీ భుజం గాయంతో ఇటీవల ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నాడు. ఈ నెలలోనే గార్నీ భుజాని సర్జరీ జరగాల్సిన ఉండడంతో.. మెగా ఈవెంట్ నుంచి వైదొలిగాడు. హ్యారీ గార్నీ స్థానాన్ని కేకేఆర్ యాజమాన్యం అలీ ఖాన్‌తో పూడ్చింది. ప్రస్తుతం కేకేఆర్ స్వాడ్‌లో ఏడుగురు విదేశీ ఆటగాళ్ళు కలిపి మెుత్తం 23 మంది ప్లేయర్స్ ఉన్నారు. సీపీఎల్ 2020 విజేత ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున అలీ ఖాన్ ఆడాడు. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

2018 గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో అలీ ఖాన్ ఆడాడు. ఆ లీగ్‌లో విండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో దృష్టిని ఆకర్షించాడు. దీంతో సీపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. 2018లో గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడిన అలీ ఖాన్.. 12 మ్యాచ్లలో 16 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. డ్వేన్ బ్రావో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'నెక్స్ట్ స్టాప్ దుబాయ్' అనే క్యాప్షన్‌ను పోస్ట్ చేశాడు. ఫొటోలో బ్రావోతో పాటు అలీ ఖాన్, బ్రెండన్ మెక్కల్లమ్ ఉన్నారు. డ్రాఫ్ట్‌లో ఉన్న ఏకైక యుఎస్‌ఏ ప్లేయర్‌గా ఉండటం గొప్ప గౌరవం, ఐపీఎల్‌కు ఎంపికయినందుకు నా కల నిజమైనట్టే అని ఖాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఐపీఎల్ 2020 సీజన్‌లో కొత్త కోచ్‌ నేతృత్వంలో నైట్‌రైడర్స్‌ బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 2019లో పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ఆ జట్టుకి అసాధారణ విజయాల్ని సాందించింది. కానీ పేలవ బౌలింగ్ కారణంగా కోల్‌కతా గెలిచే మ్యాచ్‌లను చేజార్చుకుంది. దీంతో ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో కోల్‌కతా ఫ్రాంఛైజీ బౌలర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్‌ను రూ. 15.50 కోట్లకి దక్కించుకుంది. హ్యారీ గార్నీని కూడా తీసుకుంది. అతడు తప్పుకోవడంతో ఖాన్ ఎంపికయ్యాడు.

Story first published: Saturday, September 12, 2020, 13:50 [IST]
Other articles published on Sep 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+