రోహిత్, ధోనీ వల్ల కూడా కాదు..
ఆర్‌సీబీ చెత్త టీమ్ అని, ఒకరిద్దరూ మినహా ఎవరూ రాణించడం లేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పేలవ బౌలింగ్, బలహీనమైన మిడిలార్డర్, బ్యాటింగ్ డెప్త్ లేని లోయరార్డర్ కలిగిన ఆర్‌సీబీ జట్టును గెలిపించడం ఎవరి వల్ల కాదంటున్నారు. చివరకు ధోనీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ వహించినా ఈ తరహా ఆటతో ఆర్‌సీబీ గెలవలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ(41 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 53), దేవదత్ పడిక్కల్(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీలతో 111 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభాన్ని అందిస్తే మిగతా బ్యాట్స్‌మన్ ఆ జోరు కొనసాగించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, పడిక్కల్ జోరు చూసిన తర్వాత టీమ్ సునాయసంగా 200 పరుగులు చేస్తుందని భావించామని, కానీ పేలవ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ మూల్యం చెల్లించుకుందని మండిపడుతున్నారు.
చెత్త బౌలింగ్..
ఇక 156 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం ఆర్‌సీబీ బౌలర్లు చేయలేదని, అసలు ఆటగాళ్లలో గెలవాలనే ఇంటెంట్ కనిపించలేదని మండిపడుతున్నారు. పిచ్ నుంచి సహకారం లభించినా ఏ ఒక్కరు అద్భుతంగా బౌలింగ్ చేయలేకపోయరని విమర్విస్తున్నారు. అసలు జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్ ఒక్కరు లేరని మండిపడుతున్నారు. ఫస్టాఫ్‌లో కట్టడిగా బౌలింగ్ చేసిన సిరాజ్, హర్షల్ పటేల్ దారుణంగా విఫలమవుతున్నారని, ధారళంగా పరుగులిస్తున్నారని విమర్శిస్తున్నారు. చెన్నై జట్టులో రాణించిన బ్రావో తరహా బౌలర్ ఆర్‌సీబీలో లేకపోవడం ఆ జట్టును కొంపముంచుతుందని కామెంట్ చేస్తున్నారు.
లార్డ్ శార్దూల్..
మ్యాచ్‌ను మలుపు తిప్పిన శార్దూల్ ఠాకూర్‌పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లార్డ్ శార్దూల్ ఠాకూర్ మరోసారి తన పేరును నిలబెట్టుకున్నాడని కొనియాడుతున్నారు. తన చివరి ఓవర్‌లో శార్దూల్ వరుస బంతుల్లో కీలక వికెట్లు తీసి ఆర్‌సీబీని దెబ్బతీశాడు. ముందుగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌ను పేవిలియన్ చేర్చిన శార్దూల్.. ఆ మరుసటి బంతికే క్రీజులో కుదురుకున్న పడిక్కల్‌ను ఔట్ చేశాడు. దాంతో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు ఇన్నింగ్స్ ముగిసే వరకు ఉన్నా.. ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసేది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శార్దూల్ ప్రతిభను అభిమానులు కొనియాడుతున్నారు.
చెన్నై జోరు..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్(11), టీమ్ డేవిడ్(1), మ్యాక్స్‌వెల్(9) దారుణంగా విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో మూడు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం చేజింగ్‌కు దిగిన చెన్నై 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 157 రన్స్ చేసి సునాయస విజయాన్నందుకుంది. రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 38), ఫాఫ్ డుప్లెసిస్(26 బంతుల్లో 31), అంబటి రాయుడు(22 బంతుల్లో 32) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. చాహల్, మ్యాక్స్‌వెల్ ఓ వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications
