చెల్లి పెళ్లి.. కన్నీరు పెట్టుకున్న ఆర్‌సీబీ స్టార్!
న్యూఢిల్లీ: సాధారణంగా పెళ్లి తంతు అంటేనే ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ముఖ్య ఘట్టాలు ఉంటాయి. ఇందులో అప్పగింతలు అనేది ప్రధాన ఘట్టం. పెళ్లి తర్వాత అమ్మాయిని వరుడు కుటుంబానికి వధువు తల్లిదండ్రులు అప్పగించే తంతే ఇది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా జరిగిన పెళ్లి వేడుకలో ఒక్కసారిగా విషాదం నెలకొంటుంది.
ఈ సందర్భంలో వధువు కుటుంబ సభ్యులు అందరు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటారు. గారాబంగా పెంచుకున్న తమ కుమార్తెకు ఎలాంటి కష్టం రానీయకుండా చూసుకోవాలని, ఏదైనా తప్పులు జరిగితే కాస్త సర్దుకుపోవాలని తల్లిదండ్రులు వధువును, వరుడు కుటుంబానికి అప్పగిస్తూ వేడుకుంటారు.

కన్నవారిని విడిచిపెట్టి అత్తింటికి వెళ్లాలంటే..అమ్మాయి కూడా అంతే దుఃఖంతో విలపిస్తోంది. అమ్మనాన్నలను, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులను పలకరిస్తూ బోరున ఏడ్చేస్తుంటారు. ఏ మతం అయినా..పెళ్లి ఏ సంప్రదాయంలో జరిగినా.. అప్పగింతలు అనే ఘట్టం కామన్. కాకపోతే పద్దతులే విభిన్నంగా ఉంటాయి.
తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఆల్‌రౌండర్, శ్రీలంక స్టార్ ప్లేయర్ వానిందు హసరంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. తన చెళ్లి పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో హసరంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. చెల్లితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
దేశాలు మారినా మనుషుల మధ్య అనుబంధాలు చెరిగిపోవని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న వానిందు హసరంగా ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. కానీ ఇటీవలే ముగిసిన లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్)లో హసరంగా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
అప్‌కమింగ్ ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్‌లోనూ శ్రీలంక తరఫున హసరంగా కీలకం కానున్నాడు. ఈ రెండో టోర్నీల్లోని ప్రదర్శన ఆధారంగా హసరంగా విషయంలో ఆర్‌సీబీ తుది నిర్ణయం తీసుకోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications