ధోనీ భయ్యా.. నాకొక ఎల్ సైజ్ ప్లీజ్!

చెన్నై: క్రికెట్ కిట్, గ్లవ్స్‌లతో పాటు తన దుస్తులపై కూడా చాలాసార్లు భారత ఆర్మీ 'క్యామోఫ్లాజ్' ప్రింట్‌ను ధరించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జెర్సీలపై కూడా దానిని తీసుకొచ్చాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం సీఎస్‌కే రూపొందించిన కొత్త జెర్సీలో ఆటగాళ్ల భుజాలపై ఈ 'క్యామోఫ్లాజ్' కనిపిస్తుంది. ఈ జెర్సీని బుధవారం ధోనీ స్వయంగా ఆవిష్కరించాడు. ధోనీకి భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా గౌరవ హోదా కూడా ఉంది. 2019లో పారాచూట్ శిక్షణ కూడా తీసుకున్నాడు.
భారత సైనికులకు
భారత సైనికులకు సంఘీభావంగా ఈ ప్రింట్‌ను ముద్రించినట్లు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. సాయుధ దళాలకు సంబంధించి నిస్వార్థ పాత్ర గురించి అవగాహన పెంచడానికి ప్రయత్నించాలనుకున్నాం. చివరికి ఈ విధంగా సాధ్యమైంది. వారు నిజమైన హీరోలు" అని జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా సీఎస్కే సీఈఓ విశ్వనాథన్ వెల్లడించాడు. 2010, 2011, 2018లలో మూడు సార్లు ధోనీ సారథ్యంలోని చెన్నై జట్టు ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఇందుకు గుర్తుగా సీఎస్‌కే మూడు స్టార్లను జెర్సీపై ఉంచింది.

ఆర్మీపై ప్రేమ..
సీఎస్కే.. సాయుధ దళాలపై తమకున్న ప్రత్యేక ప్రేమను చాటుకుంది. 2019 ఐపీఎల్‌కు ముందు కూడా రూ.2 కోట్ల చెక్కును సాయుధ బలగాలకు అందించింది. జెర్సీ భుజ భాగంలో ఆర్మీ గోల్డ్ బ్యాండ్ కనిపించేలా తయారు చేశారు. ఇది సీఎస్కే నిలకడకు, ఫెయిర్ ప్లేకు నిదర్శనమని చెన్నై భావిస్తోంది. మొత్తం 11 సీజన్లలో చెన్నై 5 సార్లు ఫెయిర్ ప్లే అవార్డును కైవసం చేసుకుంది. జెర్సీ కావాల్సిన అభిమానులు తమ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సీఎస్కే పేర్కొంది.

జడేజా ఫన్నీ కామెంట్..
అయితే ఈ కొత్త జెర్సీని ఆవిష్కరిస్తున్న వీడియోను సీఎస్‌కే ఇన్‌స్టా వేదికగా పంచుకోగా.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తనదైన శైలిలో కామెంట్ చేశాడు.ప్లీజ్ నాకొక ఎల్ సైజ్ ఇవ్వరా? అని కామెంట్ చేశాడు. దీనికి సీఎస్‌కే.. 'మీ కోసం ఇప్పటికే సిద్దం చేశాం సర్.. ముంబైలో ఇస్తాం. త్వరగా రండి'అని బదులిచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

క్వారంటైన్‌లో రైనా..
స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఈ సీజన్‌లో ఆడటంపై అనుమానాలు తొలిగిపోయాయి. లీగ్‌లో పాల్గొనేందుకు బుధవారం ముంబై చేరుకున్న రైనా క్వారంటైన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం చెన్నై వేదికగా ట్రైనింగ్ చేస్తున్న సీఎస్‌కే ఈ శుక్రవారం ముంబై చేరుకుంటుంది. క్వారంటైన్ అనంతరం రైనా టీమ్‌తో కలవనున్నాడు. ఏప్రిల్ 10న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో సీఎస్‌కే.. ఢిల్లీతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే.. గాయంతో విశ్రాంతిలో ఉన్న జడేజా ఈ సీజన్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా అనే దానిపై స్పష్టత లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications