Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final:టీమిండియా ఔట్​డోర్ ప్రాక్టీస్​ షురూ!

Ravindra Jadeja Shares Pictures Of His First Outing In Southampton ahead of WTC Final
IND VS ENG : Pitch Helps ENG Bowlers But India Will Win The Series || Oneindia Telugu

లండన్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌(డబ్ల్యూటీసీ ఫైనల్)తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం యూకే పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఔట్‌డో‌ర్ ప్రాక్టీస్ ప్రారంభించింది. కరోనా నేపథ్యంలో ఈ పర్యటనకు ముందు 10 రోజుల పాటు ముంబైలో క్వారంటైన్​లో ఉన్న భారత జట్టు ఆటగాళ్లు.. అక్కడికి చేరుకున్నా మరో 10 రోజులు హోటల్ గదికే పరిమితం కానున్నారు. ఇందులో 3 రోజులు కఠిన క్వారంటైన్​లో ఉన్న తర్వాత మైదానంలో ప్రాక్టీస్​ చేసుకోవచ్చు.

గురువారం ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన ఆటగాళ్లు.. కఠిన క్వారంటైన్​ గడువును పూర్తి చేసుకొని ఔట్​డోర్ సెషన్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో మైదానంలోని పిచ్‌పై జడేజా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. 'సౌతాంప్టన్‌లో తొలి ఔటింగ్.. సంతోషంగా ఉంది'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

సౌతాంప్టన్ వేదికగా ఈ నెల 18 నుంచి వరకు జరగనున్న ఈ టైటిల్ పోరులో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. 23వ తేదీని రిజర్వ్‌ డేగా కేటాయించారు. ఆ తర్వాత 42 రోజుల విరామం తర్వాత ఇంగ్లండ్‌తో కోహ్లీసేన ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఆగస్టు 4న నాటింగ్‌హమ్‌లో తొలి టెస్టు మొదలు కానుంది. అయితే ఆ టెస్టుకు ముందు కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లూ జరగనున్నాయి.

చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్‌ 14న ముగుస్తుంది. దీంతో 104 రోజుల పర్యటనకు శుభం కార్డు పడుతుంది. 42 రోజుల గడువు ఉన్నా.. కరోనా పరిస్థితులు, క్వారంటైన్ దృష్ట్యా అక్కడే ఉండేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది.

Story first published: Monday, June 7, 2021, 17:48 [IST]
Other articles published on Jun 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+