Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవీంద్ర జడేజా రిటైర్మెంట్..?

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సిద్దమయ్యాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా జడేజా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తన 8వ నెంబర్ జెర్సీ ఫొటోను జడేజా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. ఎన్నడూ లేని విధంగా జడేజా తన జెర్సీని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం చర్చనీయాంశమైంది.

అంతర్జాతీయ టెస్ట్‌లకు వీడ్కోలు పలికేందుకు జడేజా సిద్దమయ్యాడనే చర్చ మొదలైంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన జడేజా.. వన్డే, టెస్ట్‌ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇటీవల అతను పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు.

Ravindra Jadeja Shares Cryptic Picture O

ఆస్ట్రేలియా పర్యటనలో అటు బ్యాటర్‌గా.. ఇటు బౌలర్‌గా విఫలమయ్యాడు. ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌లు ఆడిన జడేజా 4 వికెట్లు మాత్రమే తీసి 135 పరుగులే చేశాడు. దాంతో ఈ సిరీస్‌ను టీమిండియా 1-3తో ఆసీస్‌కు కోల్పోయింది. వన్డేల్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఈ క్రమంలోనే అతను రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడనే ప్రచారం ఉపందుకుంది.

ఈ ప్రచారానికి తగ్గట్లు జడేజా జెర్సీ ఫొటోను పంచుకోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ ఫొటోపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నాడు. హ్యాపీ రిటైర్మెంట్ డే జడేజా అని విష్ చేస్తున్నారు.

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లకు ఎంపికయ్యే భారత జట్లలో జడేజాకు చోటు దక్కదనే ప్రచారం కూడా ఊపందుకుంది. అతనికి బదులు అక్షర్ పటేల్‌ను తీసుకోనే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జడేజా తన రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 80 టెస్ట్‌లు ఆడిన జడేజా 3, 370 పరుగులు చేసి 323 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, January 10, 2025, 21:14 [IST]
Other articles published on Jan 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+