Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ విజయాన్ని ధోనీకి అంకితమిస్తున్నాం: రవీంద్ర జడేజా

అహ్మదాబాద్: సొంత అభిమానుల ముందు ఓ గుజరాతీగా ఐదో ఐపీఎల్ టైటిల్ గెలవడం చాలా సంతోషంగా ఉందని చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

చివరి 2 బంతులకు 10 పరుగులు చేయాల్సిన సమయంలో రవీంద్ర జడేజా 6, 4 బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ థ్రిల్లింగ్ విక్టరీ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌తో మాట్లాడిన జడేజా.. ఈ విజయాన్ని మహేంద్ర సింగ్ ధోనీకి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. 'నా సొంత అభిమానుల సమక్షంలో ఓ గుజరాతీగా ఐదో ఐపీఎల్ టైటిల్ గెలవడం గొప్ప అనుభూతి.

Ravindra Jadeja says

మైదానానికి వచ్చిన అభిమానులు అసాధారణ రీతిలో మద్దతు తెలిపాడు. గత రెండు రోజులుగా వర్షంలో ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులందరికి నా అభినందనలు. ఈ విజయాన్ని మా జట్టులోని ప్రత్యేకమైన వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీకి అంకితమిస్తున్నాను.

బ్యాట్‌ను బలంగా ఊపాలని గట్టిగా అనుకున్నాను. వీలైనంత వరకు విజయం కోసం పోరాడాలని నిశ్చయించుకున్నా. బంతి ఎక్కడికి వెళ్తుందో అనేది పట్టించుకోలేదు. బ్యాట్‌ను బలంగా తిప్పడంపైనే ఫోకస్ పెట్టాను. నా బలాన్ని నమ్ముకొని స్ట్రైట్ కొట్టాను. ఎందుకంటే మోహిత్ శర్మ స్లోయర్ బాల్స్ వేస్తాడనే విషయం నాకు తెలుసు.'అని జడేజా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 214 పరుగులు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సాయి సుదర్శన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. వృద్దిమాన్ సాహా(39 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 54) హాఫ్ సెంచరీతో రాణించాడు.

శుభ్‌మన్ గిల్(20 బంతుల్లో 7 ఫోర్లతో 39), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 2 సిక్సర్లతో 21 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చెన్నై బౌలర్లలో పతీరణ రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ తలో వికెట్ తీసారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లకు కోల్పోయి 171 పరుగులు చేసి గెలుపొందింది. డెవాన్ కాన్వే(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47), శివమ్ దూబే(21 బంతుల్లో 2 సిక్స్‌లతో 32), అంబటి రాయుడు(8 బంతుల్లో సిక్స్, 2 ఫోర్లతో 19), అజింక్యా రహానే(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, May 30, 2023, 2:10 [IST]
Other articles published on May 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+