Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏడాది తర్వాత ధోనీని కలిసిన జడేజా.. ఏమోషనల్!

Ravindra Jadeja says Still feel the same excitement on meeting MS Dhoni as 2009

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడు రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ముంబైలో ఏర్పాటు చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ క్యాంప్‌కు ఇటీవల చేరుకున్న రవీంద్ర జడేజా తాజాగా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలుసుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత మహీని కలిసిన జడేజా ఏమోషనల్ అయ్యాడు.

'మహేంద్రసింగ్ ధోనీని ఎప్పుడు కలిసినా మొదటిసారి అతన్ని కలిసినట్లు అనిపిస్తుంది. 2009లో తొలిసారి అతన్ని కలిసినప్పుడు ఎలాంటి ఉత్సుకతతో ఉన్నానో.. ఇప్పుడూ సేమ్ అదే ఫీలింగ్''అని ఈ స్టార్ ఆల్‌రౌండర్ వెల్లడించాడు. ఇక మహేంద్రసింగ్ ధోనీతో సుదీర్ఘకాలంగా రవీంద్ర జడేజాకు మంచి స్నేహబంధం ఉంది. భారత్ జట్టుకి కూడా ఈ ఇద్దరూ చాలా రోజులు కలిసి ఆడగా.. ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా ఆడుతున్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో టీమిండియాలోనూ రవీంద్ర జడేజా రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాడు. ఇప్పటికీ చెన్నై టీమ్‌లో ధోనీతో అత్యంత సరదాగా గడిపే ఆటగాళ్లలో రవీంద్ర జడేజా, సురేశ్ రైనా ప్రముఖంగా కనిపిస్తుంటారు.

తాజాగా క్వారంటైన్ ముగియడంతో జట్టుతో కలిసిన జడేజా.. సహచర ఆటగాళ్లతో సరదాగా గడిపాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తన ఫస్ట్ మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన తర్వాత ధోనీ, జడేజా కలవడం ఇదే తొలిసారి.

Story first published: Friday, April 2, 2021, 21:09 [IST]
Other articles published on Apr 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+