For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌తో చెలరేగడానికి ధోనీ చెప్పిన ఆ చిట్కానే కారణం: రవీంద్ర జడేజా

Ravindra Jadeja says MS Dhoni tells me that if we take the match to the end, then a lot of runs can be scored
Ravindra Jadeja Recalls Dhoni's Advice after Batting Against Australia

కాన్‌బెర్రా: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన చిట్కాతోనే మూడో వన్డేలో చెలరేగానని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్తే సునాయసంగా భారీ స్కోర్ చేయవచ్చని మహీ చెప్పాడని, ఆ ఫార్మూలతోనే రాణించానన్నాడు. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 13 పరుగులతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ధోనీదే క్రెడిట్..

ధోనీదే క్రెడిట్..

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై మాట్లాడిన జడేజా.. సూపర్ పెర్ఫామెన్స్ క్రెడిట్ అంతా ధోనీదేనని తెలిపాడు. గతంలో అతను ఇచ్చిన సలహాతోనే ఇది సాధ్యమైందన్నాడు. మ్యాచ్‌లో ఆఖరి 5 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే సునాయసంగా పరుగులు చేయవచ్చని ధోనీ చెప్పాడని జడేజా గుర్తు చేసుకున్నాడు. ‘మహీ భాయ్ టీమిండియా, చెన్నై తరఫున చాలా కాలం ఆడాడు. భాగస్వామ్యాలు నమోదు చేసే విషయంలో అతను ఓ ప్యాటర్న్‌ను సెట్ చేశాడు. క్రీజులో ఏ బ్యాట్స్‌మెన్ ఉన్నా పార్ట్‌నర్ షిప్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకసారి కుదురుకున్నాక భారీ షాట్లు ఆడటానికి ప్రయత్నిస్తాడు.

మా ప్రణాళిక అదే..

మా ప్రణాళిక అదే..

అతని ప్రభావం నాపై ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అతనితో నేను చాలా ఏళ్లు ఆడాను. క్లిష్ట స్థితిలో అతనితో కలిసి భాగస్వామ్యాలు నమోదు చేశాను. మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకెళ్తే పరుగులు వాటంతటే అవే వస్తాయని ధోనీ భాయ్ నాకు చెప్పాడు. ఆసీస్‌తో చివరి వన్డేలో కూడా నాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. హార్దిక్ పాండ్యా, నేను ఆఖరి వరకు ఉండాలనుకున్నాం. చివరి 5 ఓవర్లలో అవకాశం తీసుకోవాలనుకున్నాం. ఆ ప్రణాళికతోనే చెలరేగి ఫలితం రాబట్టాం'అని జడేజా తెలిపాడు.

150 పరుగుల భాగస్వామ్యంతో..

150 పరుగుల భాగస్వామ్యంతో..

ఇక 152 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా(76 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా ఆదుకున్నారు. విధ్వసంకర బ్యాటింగ్‌తో ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించి జట్టు స్కోర్‌ను 300 ధాటించారు. వీరి విరోచిత ఇన్నింగ్స్‌కు భారత్ చివరి 10 ఓవర్లలో 110 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఆల్‌రౌండర్స్ జోడీని కొనియాడాడు. ఆసీస్‌పై గెలవాలంటే ఈ ఇద్దరిలానే ఆడాలన్నాడు.

మ్యాక్స్‌వెల్ భయపెట్టినా..

మ్యాక్స్‌వెల్ భయపెట్టినా..

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' హార్దిక్‌ పాండ్యా (76 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. తర్వాత ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఫించ్‌ (82 బంతుల్లో 75; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మ్యాక్స్‌వెల్‌ (38 బంతుల్లో 59; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. శార్దుల్‌ 3 వికెట్లు, బుమ్రా, నటరాజన్‌ రెండేసి వికెట్లు తీశారు.

చేధనలో ఆసీస్ 158 పరుగులకే 5 వికెట్లు కోల్పోవడంతో భారత్‌కు విజయం ఖాయమవుతున్న తరుణంలో మ్యాక్స్‌వెల్‌ ధాటిగా ఆడిన ఇన్నింగ్స్‌ ఆసీస్‌ను 268/6 దాకా తీసుకెళ్లింది. ఇక 34 బంతుల్లో 35 పరుగుల విజయ సమీకరణం భారత్‌ను క్లీన్‌స్వీప్‌ చేసేలా కనిపించింది. కానీ బుమ్రా వేసిన 45వ ఓవర్‌ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. మ్యాక్స్‌వెల్‌ను ఔట్‌ చేయడంతో 268 పరుగుల వద్ద ఏడో వికెట్‌ పడింది. తర్వాత టెయిలెండర్లు 21 పరుగుల వ్యవధిలోనే నిష్క్రమించడంతో ఆసీస్‌ ఆలౌటైంది.

టీ20 సిరీస్ ముందు ఆస్ట్రేలియాకు గట్టి షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం!

Story first published: Thursday, December 3, 2020, 11:13 [IST]
Other articles published on Dec 3, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+