Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఫేవరేట్ బ్యాటింగ్ పార్టనర్ అతనే: రవీంద్ర జడేజా

Ravindra Jadeja says MS Dhoni is my favourite batting partner

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీనే తన బెస్ట్ బ్యాటింగ్ పార్టనర్ అని ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. సీఎస్‌కే‌తో తన ప్రయాణం దశాబ్దకాలం పూర్తయిన సందర్భంగా ఫ్రాంచైజీ అధికారిక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడ్డూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చెన్నై ఫ్రాంచైజీతో తనకున్న భావోద్వేగ క్షణాలను గుర్తు చేసుకున్నాడు. సీఎస్‌కే తనకు సొంత ఇల్లు లాంటిదని, 10 ఏళ్లుగా ఈ ఫ్రాంచైజీకే ఆడుతున్నానని, ఫ్రాంచైజీ పెద్దలు తనను చాలా బాగా చూసుకుంటారని చెప్పాడు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలని, అతను తన కెరీర్‌కు పిల్లర్ అని చెప్పుకొచ్చాడు.

సీఎస్‌కే నాకు ఇల్లు లాంటిది..

'సీఎస్‌కే నాకు ఇల్లు లాంటిది. 10 ఏళ్లుగా ఈ ఫ్రాంచైజీకి ఆడుతున్నా. ఫ్రాంచైజీ పెద్దలు నన్ను బాగా ట్రీట్ చేస్తారు. నేను అడగిన ప్రతీది ఇస్తారు. ఇప్పటి వరకు నేను అడిగినది ఏదీ మేనేజ్‌మెంట్ కాదనలేదు. సపోర్ట్ స్టాఫ్, సీఈవో కాశీ సర్ అందరూ నాతో బాగుంటారు. వీళ్లంతా నాకు ఎంతో ప్రత్యేకం. ఇక నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే అది మహీ భాయ్.

 మహీ భాయ్ నా కెరీర్ పిల్లర్ ..

మహీ భాయ్ నా కెరీర్ పిల్లర్ ..

అతను నా క్రికెట్ కెరీర్‌‌కు పిల్లర్ లాంటి వాడు. కెరీర్ ప్రారంభం నుంచి అది ఇండియా కానీ, సీఎస్‌కే కానీ నాకు అండగా నిలిచాడు. సీఎస్‌కేను కాదని మరో జట్టుకు ఆడాలనేమోననే ఫీలింగ్ కలుగుతోంది. నాకే కాదు ఈ జట్టులోకి వచ్చి పోయిన ప్రతీ ఒక్కరు ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. సీఎస్‌కే తరఫున ఆడే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఈ జట్టు తరఫునే కొనసాగుతాననుకుంటున్నా. నా కెరీర్ చివరి మ్యాచ్‌వరకు సీఎస్‌కేతోనే ఉంటానని ఆశిస్తున్నా.'అని జడేజా చెప్పుకొచ్చాడు.

 సీఎస్‌కే హెయిర్ కట్‌పై..

సీఎస్‌కే హెయిర్ కట్‌పై..

సీఎస్‌కు ఆడుతున్న కొత్తలో రవీంద్ర జడేజా వినూత్న హెయిర్ కట్‌తో కనిపించాడు. సీఎస్‌కే అక్షరాలు కనిపించేలా తన జుట్టును కత్తిరించుకున్నాడు. ఇక ఆ ఫొటో గురించి ప్రశ్నించగా.. అప్పటి రోజులను జడేజా గుర్తు చేసుకున్నాడు. 'సురేశ్ రైనా, నేను హెయిర్ కట్ చేసుకోవాలనుకున్నాం. ఇద్దరం కలిసి బార్బర్ షాప్‌కు వెళ్లాం. ముందుగా రైనా హెయిర్ కట్ పూర్తయింది. ఆ తర్వాత నేను కటింగ్ చేసుకుంటుండగా.. డిఫరెంట్‌గా చేసుకోవచ్చు కదా? అని రైనా అడిగాడు. నాపేరు కనిపించేలా చేసుకోమన్నాడు. దానికి నేను అంగీకరించలేదు. దాంతో సీఎస్‌కే పేరు రాసుకోమని సూచించాడు. దానికి అంగీకరించిన నేను.. సీఎస్‌కే అక్షరాలు కనిపించేలా హెయిర్ కట్ చేసుకున్నా.'అని జడేజా చెప్పుకొచ్చాడు.

 అందుకే ధోనీ కొట్టాడు..

అందుకే ధోనీ కొట్టాడు..

ఇక ధోనీ తన బ్యాట్‌తో జడేజా హెల్మెట్‌పై కొట్టిన ఘటనను కూడా జడేజా గుర్తు చేసుకున్నాడు. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుందన్నాడు.'ఆ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ వేసిన బంతిని హిట్ చేశాను. అయితే షాట్ ఆడే క్రమంలో కిందపడిపోయాను. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మహీ భాయ్ రన్ రన్ రన్.. అంటూ గట్టిగా అరిచాడు. స్ట్రైక్ మార్చమని చెప్పాడు. నేను మాత్రం అతన్ని చూడకుండా బంతినే చూస్తూ ఉండిపోయా. ఎందుకంటే బంతి మిడిల్ అవ్వడంతో ఫోర్ లేదా సిక్స్ వెళ్తుందనే నమ్మకంతో ఉన్నా. దాంతో ధోనీ భాయ్ నా దగ్గరకు వచ్చి నవ్వుతూ తన బ్యాట్‌తో నా హెల్మెట్‌ను బాదాడు'అని జడేజా గుర్తు చేసుకున్నాడు.

ఓవల్ మైదానం.. బ్యాక్ వర్డ్ పాయింట్, ధోనీ చాలా ఇష్టం..

ఓవల్ మైదానం.. బ్యాక్ వర్డ్ పాయింట్, ధోనీ చాలా ఇష్టం..

ఇక ర్యాపిడ్‌ఫైర్ రౌండ్‌లో కొన్ని ప్రశ్నలకు జడేజా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. బ్యాక్ వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేయడం తనకిష్టమని తెలిపాడు. చివరి ఓవర్‌లో విజయానికి 18 రన్స్ కావాలి లేదా.. 11 పరుగులు డిఫెండ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ రోల్ ఎంచుకుంటావని ప్రశ్నించగా..? 18 రన్స్ చేయడానికే ఇష్టపడుతానని చెప్పాడు. ఆ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో ఆడటం తనకు చాలా ఇష్టమని తెలిపాడు. మహీ భాయ్‌ తన ఫేవరేట్ బ్యాటింగ్ పార్టనర్ అని పేర్కొన్నాడు.

Story first published: Saturday, February 26, 2022, 13:07 [IST]
Other articles published on Feb 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+