Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ప్లాన్‌తోనే ఆసీస్ పతనాన్ని శాసించా: రవీంద్ర జడేజా

 Ravindra Jadeja says I was targeting the stump-to-stump line after he takes five wickets in Nagpur Test

నాగ్‌పూర్: స్టంప్స్ లక్ష్యంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియా పతనాన్నిశాసించానని టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్‌లో జడేజా(5/47) ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మొకాలి గాయంతో సుదీర్ఘ కాలం జట్టుకు దూరమైన జడేజా.. రీఎంట్రీలోనే మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. అతని ధాటికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. తొలి రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌‌తో మాట్లాడిన జడేజా.. తన బౌలింగ్ ప్రదర్శన‌పై సంతోషం వ్యక్తం చేశాడు.

ఆ మ్యాచ్ ఆడటం కలిసొచ్చింది..

ఆ మ్యాచ్ ఆడటం కలిసొచ్చింది..

'నా బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నా బౌలింగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడటం అంత సులువైన పని కాదు. నేను ఈ మ్యాచ్ కోసం సన్నదమయ్యాను. ఎన్‌సీఏలో నా ఫిట్‌నెస్, స్కిల్స్ మెరుగుపరుచుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. అందులో భాగంగా ఓ రంజీ మ్యాచ్ కూడా ఆడాను. ఆ మ్యాచ్‌లో 42 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాను. అది నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఈ టెస్ట్ మ్యాచ్ ఆడే శక్తినిచ్చింది.

రోజు 10-12 గంటలు బౌలింగ్ చేశాను..

రోజు 10-12 గంటలు బౌలింగ్ చేశాను..

పిచ్‌పై బౌన్స్ లేదు. దాంతో స్టంప్-టు స్టంప్ లైన్ లక్ష్యంగా బౌలింగ్ చేశాను. ఆడ్ బాల్ స్పిన్ అవ్వడంతో పాటు నేరుగా దూసుకెళ్లింది. ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా.. బ్యాటర్‌ను కీపర్ క్యాచ్‌గా, స్టంపౌట్ చేస్తే.. క్రెడిట్ బంతికివ్వాల్సిందే. టెస్ట్ క్రికెట్‌లో ఎలాంటి వికెట్‌పై ఆడినా కీపర్ క్యాచ్, స్టంపౌట్‌లు బౌలర్‌ గొప్పతనమే. ఎన్‌సీఏలో నా బౌలింగ్‌‌ మెరుగుపరుచుకునేందుకు చాలా కష్టపడ్డాను. రోజు 10-12 గంటలు బౌలింగ్ చేశాను. అది నాకు ఎంతో సాయం చేసింది. ముఖ్యంగా నా రిథమ్ అందుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్‌లో లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేయాల్సి ఉంటుందనే విషయం నాకు తెలుసు.'అని జడేజా చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆసీస్‌ను భారత్ ఆడుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. రవీంద్ర జడేజా(5/47), రవిచంద్రన్ అశ్విన్(3/42) సత్తా చాటడంతో 63.5 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. మార్నస్ లబుషేన్(123 బంతుల్లో 8 ఫోర్లతో 49), స్టీవ్ స్మిత్(107 బంతుల్లో 7 ఫోర్లతో 37), పీటర్ హ్యాండ్‌స్కోంబ్(84 బంతుల్లో 4 ఫోర్లతో 31), అలెక్స్ క్యారీ(33 బంతుల్లో 7 ఫోర్లతో 36) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(69 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 56 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్రీజులో రోహిత్‌తో అశ్విన్(0) క్రీజులో ఉన్నాడు.

Story first published: Thursday, February 9, 2023, 19:18 [IST]
Other articles published on Feb 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+