Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదమే మా కొంప ముంచింది: రవీంద్ర జడేజా

Ravindra Jadeja Says Didnt get good start

ముంబై: బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన చెన్నై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. టోర్నీలో చెన్నైకి ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం విశేషం. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన జడేజా.. 20-25 పరుగులు తక్కువ చేసామని చెప్పాడు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఆరంభంలో వికెట్లు తీయలేకపోయారన్నాడు.

'బ్యాటింగ్‌లో సరైన ఆరంభం అందుకోలేకపోయాం. 20-25 పరుగులు తక్కువగా చేశాం. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సరైన ప్రదేశాల్లో వేయడంతో పాటు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి వికెట్ల కోసం ప్రయత్నం చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో మేం మెరుగవ్వాలి. మేమంతా ఫ్రొఫెషనల్ క్రికెటర్లం. విజయం కోసం మరింత శ్రమించాలి. పట్టుదలగా ఉండి పుంజుకోవడానికి ప్రయత్నించాలి'అని జడేజా చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మోయిన్ అలీ(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ ‌లతో 48), అంబటి రాయుడు(27 బంతుల్లో 4 ఫోర్లతో 27), రవీంద్ర జడేజా(15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23) రాణించగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. ఎయిడెన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య చేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. రూ. 6.50 కోట్ల ప్లేయర్ అభిషేక్ శర్మ(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75) సూపర్ బ్యాటింగ్‌తో 17.4 ఓవర్లలోనే 155 పరుగులు చేసి మరో 14 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మకు తోడుగా రాహుల్ త్రిపాఠి(15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్‌లతో 39 నాటౌట్), కేన్ విలియమ్సన్(40 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) రాణించారు. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి, డ్వేన్ బ్రావో తలో వికెట్ తీసారు.

Story first published: Saturday, April 9, 2022, 22:33 [IST]
Other articles published on Apr 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+