Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టార్ క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. 26 మందితో కూడిన కొంత మంత్రి వర్గాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం ప్రకటించారు. రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేకు తొలిసారి మంత్రి పదవి దక్కింది.

గురువారం సీఎం మినహా మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పాత క్యాబినేట్‌లో ఆరుగురు మాత్రమే తమ పదవులను నిలబెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘవి డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. కొత్త కాబినేట్‌లో 20 మందికి కొత్తగా అవకాశం దక్కింది. కొత్త మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

15 వేల ఓట్ల మెజార్టీతో..

2019 మార్చిలో బీజేపీలో చేరిన రివాబా జడేజా.. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. తన ప్రత్యర్థి బిపేంద్రసిన్హ్ జడేజా(కాంగ్రెస్‌)పై 15వేల ఓట్ల మెజార్టీతో రివాబా జడేజా విజయం సాధించింది.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రివాబా జడేజాకు వ్యతిరేకంగా రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా, తండ్రి అనిరుద్ద్ సిన్హ్ జడేజా ప్రచారం చేశారు. కానీ మామ, ఆడబిడ్డపై రివాబా జడేజానే పై చేయి సాదించింది. రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్ధతుదారులుగా ఉన్నారు. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి జడేజా సోదరి నైనబా జడేజా టికెట్ ఆశించింది. కానీ ఆమెకు టికెట్ దక్కలేదు.

Ravindra Jadeja s Wife Rivaba Jadeja Appointed as Minister in New Gujarat Cabinet

జడేజా దగ్గరుండి..

టీమిండియాకు దూరంగా ఉండి మరి జడేజా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. సతీమణి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక 1990లో జన్మంచిన రివాబా జడేజా.. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. ఆమె తండ్రి వ్యాపారవేత్త కాగా.. కాంగ్రెస్‌కు చెందిన హరి సింగ్ సోలంకి మేనకోడలు. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లిచేసుకున్న రివాబా జడేజా.. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల విలువ రూ.97 కోట్లుగా పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా.. వన్డే, టెస్ట్‌ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు.

Story first published: Friday, October 17, 2025, 14:01 [IST]
Other articles published on Oct 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+