
ఏడో స్థానంలో బ్యాటింగ్..
ఇక రెండో రోజు ఆట ముగిసిన అనంతరం రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అండర్సన్ కామెంట్లపై జడేజా స్పందిస్తూ 2014 సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నాడు. ముందుగా అండర్సన్ మాట్లాడుతూ.. 'గతంలో రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఏడో స్థానంలో రావడం వల్ల క్రీజ్‌లో కుదురుకునేందుకు ఛాన్స్ దక్కింది. సరైన బ్యాటర్‌గా బ్యాటింగ్ చేశాడు. దీంతో మాకు కష్టాలు తప్పలేదు'' అని పేర్కొన్నాడు.

బ్యాటర్‌గా గుర్తించినందుకు..
ఈ వ్యాఖ్యలపై స్పందించిన జడేజా..'పరుగులు చేసినంత కాలం బాగానే ఉంటుంది. మంచి బ్యాటర్ అని ప్రతి ఒక్కరూ అంటుంటారు. అయితే ఇవేవీ నేను పట్టించుకోను. ఎప్పుడైనా సరే క్రీజ్‌లో సమయం గడిపేందుకు వంద శాతం ప్రయత్నిస్తా. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాటర్‌తో భాగస్వామ్యం నిర్మించేందుకు చూస్తా. అండర్సన్ కామెంట్లు విన్నాను. 2014 ఘటన తర్వాత అండర్సన్ నన్ను మంచి బ్యాటర్‌గా మెచ్చుకునేలా ఇప్పుడు జ్ఞానోదయం కలగడం బాగుంది'అని జడేజా చెప్పుకొచ్చాడు.

పక్కకు తోసేయడంతో..
2014లో ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా జడేజా, అండర్సన్ మధ్య పెవిలియన్ లోపల స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అకారణంగా జడేజాను అండర్సన్ పక్కకు తోశాడని ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్‌పై టీమిండియా మేనేజ్‌మెంట్ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీంతో నిబంధనల ప్రకారం లెవల్-3 కింద అండర్సన్‌పై ఐసీసీ చర్యలు తీసుకొంది. ఇప్పుడు ఆ సంఘటనను గుర్తు చేస్తూ జడేజా వ్యాఖ్యానించడం వైరల్‌గా మారింది.

ఇంగ్లండ్ పిచ్‌లు కఠినం..
ఇంగ్లండ్ పిచ్‌లు స్వింగ్, పేస్‌కు బాగా సహకరిస్తాయని, ఇక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని జడేజా తెలిపాడు. అందుకే శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులనే ఆడాలని అభిప్రాయపడ్డాడు. 'బయట పడిన బాల్‌ను కవర్‌డ్రైవ్, స్క్వేర్ డ్రైవ్‌గా ఆడాలని ప్రయత్నిస్తే మాత్రం బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతులను వదిలేసేందుకే ప్రాధాన్యత ఇచ్చా. పొరపాటున ఆడామంటే స్లిప్‌లో దొరికిపోవడం ఖాయం. నా శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులనే బౌండరీలకు తరలించేందుకు ప్రయత్నించా. అదృష్టవశాత్తూ అలాంటివే ఎక్కువగా వచ్చాయి. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతులను వదిలేయడమే ఉత్తమం. '' అని జడేజా తెలిపాడు.


Click it and Unblock the Notifications












