Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే మహ్మద్ సిరాజ్‌కు బంతివ్వలేదు: రవీంద్ర జడేజా

Ravindra Jadeja reveals why debutant Mohammed Siraj didn’t bowl in first session of Day 1

మెల్‌బోర్న్: అడిలైడ్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్.. రెండో టెస్ట్‌లో మాత్రం ఆస్ట్రేలియాపై పై చేయి సాధించింది. తొలి రోజునే సూపర్ బౌలింగ్‌తో కంగారులను బెంబేలెత్తించింది. భారత బౌలర్ల ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది. అయితే తాత్కలిక సారథిగా భారత జట్టును నడిపిస్తున్న అజింక్యా రహానే మైదానంలో తీసుకున్న నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

అవాక్కయ్యా..

అవాక్కయ్యా..

ముఖ్యంగా ఫస్ట్ సెషన్‌ను స్పిన్నర్లతో బౌలింగ్ చేయించడం.. అరంగేట్ర పేసర్ మహ్మద్ సిరాజ్‌కు బంతినివ్వకపోవడం అవాక్కయ్యేలా చేశాయి. అయితే రహానే ఎత్తులు మాత్రం ఫలించాయి. ఫస్ట్ సెషన్‌లోనే ఆసీస్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇదే జోరును ఇన్నింగ్స్ ఆసాంతం కొనసాగించిన భారత్ ప్రత్యర్థి స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసింది. అయితే రహానే వ్యూహాన్ని మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా వివరించాడు. అతని నిర్ణయానికి తాను కూడా ఆశ్చర్యపోయానన్నాడు.

స్పిన్‌కు అనుకూలించడంతోనే..

స్పిన్‌కు అనుకూలించడంతోనే..

‘ఫస్ట్ డే బౌలర్లు చెలరేగారు. ప్రతీ విరామంలో వికెట్లు పడగొట్టారు. పిచ్ తడిగా ఉండి స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో రహానే లంచ్‌కు ముందు బౌలింగ్ చేయడానికి సిద్దంగా ఉండమని నాకు చెప్పాడు. దాంతో సిరాజ్‌కు ఫస్ట్ సెషన్‌లో బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు.'అని జడేజా చెప్పుకొచ్చాడు. ఇక తొలి సెషన్‌లో జడేజాకు వికెట్ దక్కకపోయినా.. తనదైన బౌలింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ఇక లంచ్ అనంతరం మహ్మద్ సిరాజ్‌తో బౌలింగ్ చేయించడం కూడా అందరికి ఆశ్చర్యం కలిగించింది.

సెంచరీ దిశగా రహానే..

సెంచరీ దిశగా రహానే..

ఫస్ట్ స్పెల్‌లో విఫలమైన హైదరాబాద్ పేసర్.. రెండో స్పెల్‌లో ఇరగదీశాడు. లబుషేన్, కామెరూన్ గ్రీన్ రెండు కీలక వికెట్లు తీసి ఆసీస్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు.ఇక రెండో రోజు ఆటలో భారత్.. వరుసగా వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ రహానే(87 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(31 బ్యాటింగ్)తో కలిసి పోరాడుతుండటంతో మెరుగైన స్థితిలో నిలిచింది. 83 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లకు 251 పరుగులు చేసి 56 రన్స్ ఆధిక్యాన్ని అందుకుంది.

Story first published: Sunday, December 27, 2020, 11:57 [IST]
Other articles published on Dec 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+