పుణె: టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కోసమే వినూత్నంగా సంబరాలు చేసుకున్నానని స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. తాను పట్టిన సూపర్ క్యాచ్‌ను అతనికి అంకితం చేశానన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రవీంద్ర జడేజా కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు.
అసాధారణ ఫీల్డింగ్‌తో క్రీజులో సెట్ అయిన ముష్ఫికర్ రహీమ్(38)ను పెవిలియన్ చేర్చాడు. ఈ క్యాచ్ అందుకున్న అనంతరం డగౌట్ వైపు చూస్తూ రవీంద్ర జడేజా వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌ను ఉద్దేశించి అతను చేసిన సైగలు నెట్టింట వైరల్ అయ్యాయి. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 43వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ మూడో బంతిని బుమ్రా వైడ్‌గా షార్ట్ బాల్ వేయగా.. ముష్ఫికర్ కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాక్‌వార్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా సూపర్ డైవ్‌తో బంతిని అద్భుతంగా అందుకొని అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ఈ క్యాచ్ అందుకున్న వెంటనే జడేజా డగౌట్‌లో ఉన్న ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వైపు చూస్తూ.. కొన్ని సైగలు చేశాడు.
ఈ వెరైటీ సెలెబ్రేషన్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై జడేజాను ప్రశ్నించగా.. ఆ సంబరాల వెనుక ఉన్న కారణాన్ని తెలియజేశాడు. ఈ వెరైటీ సెలెబ్రేషన్స్‌ను దిలీప్‌కు అంకితం చేశానని చెప్పాడు. ప్రతీ మ్యాచ్ తర్వాత బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఇస్తున్నారని, తనను మరిచిపోవద్దని దిలీప్‌కు గుర్తు చేశానని తెలిపాడు.
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వికెట్‌పై బంగ్లాదేశ్ విధించిన లక్ష్యాన్ని చేధించడం పెద్ద కష్టమేం కాదన్నాడు. 'ఈ వికెట్ చాలా బాగుంది. ఏ మాత్రం టర్న్ లభించడం లేదు. సింపుల్ క్రికెట్ ఆడినా.. ఈ లక్ష్యాన్ని మేం సునాయసంగా చేధిస్తాం. క్యాచ్ అనంతరం నేను చేసుకున్న వినూత్న సంబరాలు మా ఫీల్డింగ్ కోచ్‌కు అంకితం.

ప్రతీ మ్యాచ్ అనంతరం జట్టులో ఒకరికి బెస్ట్ ఫీల్డర్ అవార్డు ఇస్తున్నారు. దాంతోనే ఫీల్డింగ్ కోచ్‌కు నేను కూడా ఈ మ్యాచ్ బెస్ట్ ఫీల్డర్ అవార్డు రేసులో ఉన్నానని గుర్తు చేశాను. ఇది ఫ్లాట్ వికెట్. బ్యాట్‌పైకి బంతి మంచిగా వస్తుంది. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు మెరుగ్గా రాణిస్తే సునాయస విజయం దక్కుతుంది.
ఈ పిచ్‌పై స్పిన్నర్లకు ఎలాంటి సహకారం లేదు. స్టంప్స్ లెంగ్త్‌లో బౌలింగ్ వేస్తేనే బ్యాటర్లను కట్టడి చేయవచ్చు.'అని జడేజా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో జడేజా(2/38) రెండు కీలక వికెట్లు తీసాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటిన లిటన్ దాస్(66), నజ్మల్ హెస్సెన్ షాంటో(8)ను పెవిలియన్ చేర్చాడు.