For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravindra Jadeja:‘పుష్ప’ఊర మాస్ లుక్‌లో జడేజా.. బీడీ తాగొద్దంటూ వార్నింగ్!

Ravindra Jadeja recreates Allu Arjun’s Pushpa raw look

హైదరాబాద్: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం 'పుష్ప-ది రైజ్' బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఎంతలా ఈ సినిమా హిట్ అయ్యిందంటే.. టీమిండియా ఆటగాళ్లు కూడా ప్రత్యేకంగా ఈ సినిమాను చూసేంత బ్లాక్‌బస్ట్ ర్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్‌ను స్టార్ క్రికెటర్లు రీ క్రియేట్ చేసేంత సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాలోని 'తగ్గేదేలే'డైలాగ్ చెప్పిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. తాజాగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌ను రీక్రియేట్ చేశాడు.

నోట్లో బీడీతో మాస్ లుక్‌లో

ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్ర పోషించిన అల్లు అర్జున్ మాసిన గడ్డం.. జుంపాల జుట్టుతో చాలా మొరటుగా కనిపించాడు. నొట్లో బీడితో ఉన్న ఓ ఫొటోను జడేజా రీక్రియేట్ చేశాడు. అచ్చం అల్లు అర్జున్ మాదిరే మాసిన గడ్డం, జుంపాల జుట్టుతో నొట్లో బీడీ పెట్టుకొని మాస్ లుక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ఫొటోతో పాటు తన ఫొటోనూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దానికి పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైరూ..అనే డైలాగ్‌ను క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

బీడీ తాగొద్దంటూ..

బీడీ తాగొద్దంటూ..

అంతేకాకుండా ఈ ఫొటోనూ పూర్తిగా గ్రాఫికల్ రిప్రజంటేషన్ అని, బీడీ, పొగాకు ఆరోగ్యానికి హానికమరని, క్యాన్సర్ వస్తుందని హెచ్చరించాడు. ఈ ఫొటో కోసం తాను బీడీ తాగలేదని, ఎవరూ కూడా తాగవద్దని సూచించాడు. ప్రస్తుతం జడేజా ఊర మాస్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. బన్నీ ఫ్యాన్స్ అయితే సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. ఒక్క సినిమాతోనే పిచ్చక్రేజ్ వచ్చిందని బన్నీని కొనియాడుతున్నారు.

తెలుగుకే క్రేజ్..

తెలుగుకే క్రేజ్..

అయితే హిందీతో పాటు తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదలైనా.. తెలుగులోనే జడేజా ఈ మూవీని చూసినట్లు తెలుస్తోంది. అతను పెట్టిన తెలుగు డైలాగ్‌తోనే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఇక భారత ఆటగాళ్లు సైతం ఈ మూవీని చూసిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు.. తొలి టెస్ట్ విజయానంతరం పుష్ప మూవీని చూశారు. ఈ విషయాన్ని తెలుగు క్రికెటర్ హనుమ విహారీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఆగలేకపోతున్నామని చెప్పారు.

వెండితెరపై కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్ప.. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతుంది. నిర్ణీత సమయం కన్నా ముందే అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తోంది.

ప్రజ్ఞాన్ ఓజా ఫిదా..

ప్రజ్ఞాన్ ఓజా ఫిదా..

ఈ మూవీని చూసిన టీమిండియా మాజీ స్పిన్నర్, హైదరాబాద్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఫిదా అయ్యాడు. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశాడు. పుష్ప పుష్ఫ రాజ్.. నీ అవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ అయితే కేక అంటూ... అల్లు అర్జున్‌ను అభినందించాడు. 'ఒకప్పుడు 'పుష్ప.. ఎడ్వటం నాకు అస్సలు నచ్చదు' అనే డైలాగ్ పాపులర్ అయితే... ఇప్పుడు 'పుష్ప.. పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే' డైలాగ్ బ్లాక్ బస్టర్. అల్లు అర్జున్ గారు మీ కష్టాన్ని ఆస్వాదించాం.'అని ప్రజ్ఞాన్ ఓజా ట్వీట్ చేశాడు. ఇక ప్రజ్ఞాన్ ఓజాకు అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చాడు. 'థ్యాంక్యూ ప్రజ్ఞాన్ ఓజా గారు.. మీ ప్రేమకు కృతజ్ఞతలు'అంటూ బదులిచ్చాడు.

Story first published: Wednesday, January 12, 2022, 21:51 [IST]
Other articles published on Jan 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+