Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వార్నర్.. ఆల్‌మోస్ట్ నాలానే : జడేజా

Ravindra Jadeja reacts to David Warner imitating his trademark sword celebration

హైదరాబాద్: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. భారత అభిమానులను ఉద్దేశించి చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై టీమిండియా ఆల్‌‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. దాదాపు తనలానే ఉందని కితాబిచ్చాడు.

ఇంతకీ సంగతేంటనీ అనుకుంటున్నారా?..మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసినా.. వ్య‌క్తిగ‌త మైలురాళ్ల‌ను అందుకున్నా టీమిండియా ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా మైదానంలో బ్యాట్‌సాము చేసే విష‌యం అంద‌రికీ తెలిసిందే. బ్యాటింగ్‌లో అర్ధ‌శ‌త‌కం చేసినా.. సెంచరీ బాధినా.. జ‌డ్డూ బ్యాట్‌ను క‌త్తిలా తిప్పుతూ సంబరాలు చేసుకుంటాడు. అయితే తాను కూడా బ్యాట్ సాము చేసాన‌ని.. అది జ‌డేజాలా ఉందో లేదో చెప్పండని ఈ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ ఓ త్రో బ్యాక్ వీడియోతో ఫ్యాన్స్‌ను ప్రశ్నించాడు.

గ‌తేడాది ఐపీఎల్ సంద‌ర్భంగా తీసిన కమర్షియల్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. 'గ‌తేడాది ఇదే స‌మ‌యంలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌ఫున వాణిజ్య కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ క‌త్తిసాము (బ్యాట్‌సాము) చేశాను. ఇది జ‌డేజాలానే ఉందా ఓసారి చెప్పండి'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

ఈ వీడియోపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయగా.. జడేజా మాత్రం దాదాపు తనలానే ఉందని కితాబిచ్చాడు. 'డేవిడ్ ఆల్‌మోస్ట్ నాలానే ఉంది.. హహహ..'అని కామెంట్ చేశాడు.

కరోనాతో ఇంటికే పరిమితమైన స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. కుదిరితే లైవ్ చాట్ లేకుంటే తమకు సంబంధించిన ఫన్నీ వీడియోలతో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు. జడేజా కూడా ఈ కరోనా కారణంగా తనకు ఇష్టమైన గుర్రపు స్వారీని మిస్సవుతున్నానని.. ఓ త్రో బ్యాక్ వీడియోను షేర్ చేశాడు.

వాస్తవానికి ఈ కరోనా లేకుంటే ఈ క్రికెటర్లంతా మైదానంలో ప్రేక్షకులను అలరించేవారు. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కరోనా కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే.

Story first published: Thursday, April 9, 2020, 14:16 [IST]
Other articles published on Apr 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+