Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: ఒక్క రోజే 17 వికెట్లు.. విజయం దిశగా భారత్!

సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. బ్యాటింగ్‌లో తడబడినా బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో టీమిండియా పైచేయి సాధించింది. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 7 వికెట్లకు 93 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(29 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బవుమాతో పాటు టెయిలెండర్ కోర్బిన్ బోష్(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/29) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకుముందు 37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ 189 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(119 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39), వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్(45 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), రవీంద్ర జడేజా(45 బంతుల్లో 3 ఫోర్లతో 27) పర్వలేదనిపించారు.

Ravindra Jadeja Magic Strikes Again as South Africa Collapse in Kolkata Test

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో ఈ ఒక్క రోజే 17 వికెట్లు నేలకూలాయి. మూడో రోజు ఆటలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలనుంది. ఫస్ట్ సెషన్‌లో సౌతాఫ్రికా చివరి మూడు వికెట్లు తీస్తే.. భారత్ ముందు 100 పరుగుల లోపే లక్ష్యం నమోదు అవుతుంది. ఆ తర్వాత భారత్ ఆచితూచి ఆడితే విజయం లాంఛనమవుతుంది. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. భారత్ కూడా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సఫారీ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడాలి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్‌రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 ఫోర్లతో 23), టోనీ డీ జోర్జి(55 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కింది.

Story first published: Saturday, November 15, 2025, 16:42 [IST]
Other articles published on Nov 15, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+