Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే వరుసలో శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్.. టీజ్ చేసిన జడేజా!(వీడియో)

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌‌పై ఇప్పటి వరకు అటు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ కానీ.. శుభ్‌మన్ గిల్ కుటుంబం కానీ స్పందించలేదు. అంతేకాకుండా సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ మధ్య ప్రేమాయణం నడుస్తుందనే ఆధారాలు మాత్రం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రైవేట్ కార్యక్రమాల్లో ఈ ఇద్దరూ సీక్రెట్‌గా కలుసుకోవడం, శుభ్‌మన్ గిల్ సోదరితో సారా టెండూల్కర్ నైట్ పార్టీలకు వెళ్లిన వీడియోలు గిల్-సారా టెండూల్కర్ డేటింగ్ రూమర్స్‌కు బలం చేకూర్చాయి.

తాను ఎవరితో ప్రేమలో లేనని శుభ్‌మన్ గిల్ మీడియా ముఖంగా స్పష్టం చేసినా.. ఈ వార్తలు ఆగడం లేదు. తాజాగా వైరల్ అవుతున్న మరో వీడియో ఈ ఇద్దరి ప్రేమాయణం నిజమే అనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువ రాజ్ సింగ్‌‌కు చెందిన యూవీ కెన్ ఛారిటీ నిర్వహించిన కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ కుటుంబం హాజరైంది. యూవీ కెన్ చారిటీ విరాళల కోసం నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌కు భారత దిగ్గజ ఆటగాళ్లతో పాటు విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా హాజరయ్యారు.

Ravindra Jadeja KL Rahul Tease Shubman Gill About Sara Tendulkar at Yuvraj s Charity Event

అయితే సచిన్ ఫ్యామిలీతో పాటు టీమిండియా ఆటగాళ్లు ఒకే వరుసలో కూర్చున్నారు. ఈ క్రమంలో శుభ్‌మన్ గిల్.. సారా టెండూల్కర్ వైపు చూశాడు. కానీ అనూహ్యంగా సారా తల్లి అంజలి అతనివైపు చూడటంతో పక్కనే ఉన్న రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ శుభ్‌మన్ గిల్‌ను ఆటపట్టించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ మారంది. దాంతో మరోసారి శుభ్‌మ‌న్ గిల్-సారా టెండూల్కర్ డేటింగ్ వార్తలు తెరపైకి వచ్చాయి. గతంలో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు సారా టెండూల్కర్ హాజరైనప్పుడు కూడా ఈ తరహా వార్తలు చర్చనీయాంశమయ్యాయి.

Story first published: Friday, July 11, 2025, 18:58 [IST]
Other articles published on Jul 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+