Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన ఆల్‌రౌండర్

Ravindra Jadeja joins MS Dhoni and Virat Kohli to achieve impressive feat for India

మెల్‌బోర్న్: భారత స్టార్ ఆల్‌రౌండ్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌‌లో ఆడిన రవీంద్ర జడేజా.. టెస్టుల్లో 50 మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్నాడు. దాంతో టీ20, వన్డే, టెస్టులు.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ కనీసం 50 మ్యాచులు ఆడిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ ఘనత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ మాత్రమే సాధించారు.

మరే ఆల్‌రౌండర్..

మరే ఆల్‌రౌండర్..

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో విలువైన 57 పరుగులు చేసి.. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీశాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 50 టెస్టులాడిన జడేజా 1,926 పరుగులు, 168 వన్డేల్లో 2,411, 50 టీ20ల్లో 217 రన్స్ చేశాడు. బౌలింగ్‌లోనూ అతను టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 188, టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా భారత క్రికెట్‌లో ఈ తరహాలో మరే ఆల్‌రౌండర్ కూడా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించలేదు.

గొప్ప గౌరవం..

గొప్ప గౌరవం..

ఇలా మూడు ఫార్మాట్లలో రాణించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. తను ఈ ఘన సాధించిన సందర్భంగా జడేజా.. ధోనీ, కోహ్లీతో మూడు ఫార్మాట్లలో కలిసి ఉన్న ఫొటోలను జడేజా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘‘మహి భాయ్, విరాట్ కోహ్లీ క్లబ్‌లో చేరడం ఓ గొప్ప గౌరవం'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ జడేజా అంతర్జాతీయ స్థాయిలో 50 టెస్టు మ్యాచులు, 168 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

అద్భుత విజయం..

అద్భుత విజయం..

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్‌ గ్రీన్‌ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలవగా, సిరాజ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్‌ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్‌ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, December 30, 2020, 10:37 [IST]
Other articles published on Dec 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+