For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravindra Jadeja: 145 ఏళ్లలో ఒకే ఒక్కడు!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. గత 145 ఏళ్లలో ఇంగ్లండ్‌ గడ్డపై 30 ప్లస్ వికెట్లతో పాటు 100 పరుగులు చేసిన రెండో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం ముగిసిన నాలుగో టెస్ట్‌లో జడేజా సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా నాలుగు వికెట్లతో రాణించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటి వరకు 34 వికెట్లు తీసాడు. దాంతో ఇంగ్లండ్ గడ్డపై 1000 ప్లస్ రన్స్, 30 ప్లస్ వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

జడేజా కంటే ముందు వెస్టిండీస్ దిగ్గజం సర్ గర్‌ఫీల్డ్ సోబెర్స్ 1880లొ ఇంగ్లండ్ గడ్డపై 1000+ రన్స్, 30+ వికెట్లు తీసాడు. ఓవరాల్‌గా విదేశీ గడ్డపై ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. ఇంగ్లండ్‌కు చెందిన విల్‌ఫ్రెడ్ రోడ్స్ ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఘనతను అందుకున్నాడు.

Ravindra Jadeja Joins Elite Club Becomes Only Second Visiting Player in History with 1000 Runs and 30 Wickets in England Tests

ఇంగ్లండ్ గడ్డపై 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా జడేజా నిలిచాడు. ఓవరాల్‌గా విదేశీ గడ్డపై ఈ ఫీట్ సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. పాకిస్థాన్‌లో యువరాజ్ సింగ్ రెండు శతకాలు నమోదు చేయగా.. అశ్విన్ వెస్టిండీస్ గడ్డపై రెండు సెంచరీలు బాదాడు.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ను టీమిండియా డ్రా చేసుకోవడంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. అతనికి వాషింగ్టన్ సుందర్ కూడా అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 203 పరుగులు జోడించారు. దాంతో 174/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మ్యాచ్ ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 145 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులు చేసింది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ 358 ఆలౌట్( సాయి సుదర్శన్ 61, బెన్ స్టోక్స్ 5/72)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 669 ఆలౌట్(జోరూట్ 150, బెన్ స్టోక్స్ 141, జడేజా 4/143)

భారత్ రెండో ఇన్నింగ్స్: 425/4 (శుభ్‌మన్ గిల్ 103, జడేజా 107*, సుందర్ 101*, క్రిస్ వోక్స్ 2/67)

Story first published: Monday, July 28, 2025, 15:29 [IST]
Other articles published on Jul 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+